లవ్‌ యూ అంకుల్‌: అలియా భావోద్వేగం

1 May, 2020 10:04 IST|Sakshi

‘‘నా జీవితంలోకి ప్రేమను, మంచిని తీసుకువచ్చిన ఆ అందమైన వ్యక్తి గురించి ఏం చెప్పగలను. లెజండ్‌ రిషి కపూర్‌ గురించి ఈరోజు అందరూ మాట్లాడుతున్నారు. నేను కూడా అంతే. అయితే గడిచిన రెండేళ్లుగా ఆయన నాకు మంచి స్నేహితుడు అయ్యారు. నాలాగే ఆయన చైనీస్‌ ఫుడ్‌ లవర్‌. సినిమా ప్రేమికుడు. యుద్ధవీరుడు. నాయకుడు. అందమైన కథకుడు. గొప్ప ట్వీటర్‌. అంతేకాదు తండ్రి కూడా! ఈ రెండేళ్లలో ఆయన నుంచి నేను పొందిన ప్రేమ.. ఆత్మీయ ఆలింగనాలు నా మదిలో నిలిచిపోతాయి! అంత గొప్ప అదృష్టాన్ని నాకు ఇచ్చిన విశ్వానికి ధన్యవాదాలు. ఈరోజు చాలా మంది ఆయన తమ కుటుంబ సభ్యుడి లాంటివారని అంటున్నారు. ఆయన మిమ్మల్ని అలా ఫీలయ్యేలా చేశారు! లవ్‌ యూ రిషీ అంకుల్‌! మిమ్మల్ని మిస్‌ అవుతున్నాం! మీరు మీలా ఉన్నందుకు కృత​​జ్ఞతలు’’ అంటూ బాలీవుడ్‌ హీరోయిన్‌ అలియా భట్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ లేఖ షేర్‌ చేశారు. రిషి కపూర్‌ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన ఆమె.. ఆయనపై తనకున్న అభిమానాన్ని లేఖ ద్వారా చాటుకున్నారు. అంతేగాక రిషి రణ్‌బీర్‌ కపూర్‌ను ఒడిలో కూర్చోబెట్టుకున్న మరో ఫొటోను షేర్‌ చేసి.. బ్యూటిఫుల్‌ బాయ్స్‌ అంటూ క్యాప్షన్‌ జత చేశారు. అదే విధంగా నీతూ, రిషిల పాత ఫొటోను అభిమానులతో పంచుకున్నారు అలియా. (బాబీ హీరో మరి లేడు)

ఇక ఇందుకు స్పందించిన రిషి కపూర్‌ భార్య నీతూ కపూర్‌ అలియాకు ‘‘లవ్‌ యూ’’ అంటూ బదులిచ్చారు. కాగా రిషి కపూర్‌ తనయుడు, బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌తో అలియా భట్‌ ప్రేమలో ఉన్నారంటూ గత కొంతకాలంగా వార్తలు ప్రచారమవుతున్న సంగతి తెలిసిందే. తరచుగా డిన్నర్‌ డేట్లు, ఫ్యామిలీ గెట్‌ టుగెదర్‌లతో భట్‌, కపూర్‌ కుటుంబాలు చేస్తున్న హంగామా వీటికి బలం చేకూర్చింది. నీతూ కపూర్‌తో రిషి కూడా అలియాపై ప్రత్యేక అభిమానం చూపేవారు. అంతేకాదు ‘కపూర్‌ అండ్‌ సన్స్‌’ సినిమాలో రిషి కపూర్‌తో అలియా కలిసి నటించారు కూడా.  అప్పటి నుంచి ఆయనతో బంధం బలపడిందన్న అలియా... రిషి తన తండ్రిలాంటి వారని పలు సందర్భాల్లో చెప్పారు. ఈ క్రమంలో రణ్‌బీర్‌- అలియాల ప్రేమకు కపూర్‌, భట్‌ ఖాన్‌దాన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందంటూ త్వరలోనే వారు పెళ్లిపీటలు ఎక్కబోతున్నారంటూ రాలియా అభిమానులు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశారు. ఇప్పుడు రిషి తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో.. కొడుకు ఒక ఇంటివాడు కాకముందే అలనాటి చాకొలెట్‌ బాయ్‌ కుటుంబాన్ని వీడి వెళ్లారంటూ విషాదంలో మునిగిపోయారు. (సరస సంగీతమయ కథానాయకుడు)

❤️❤️❤️

A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా