అవన్ని చెత్త కథనాలు: సోనాక్షి సిన్హా

2 Jul, 2013 15:03 IST|Sakshi
Sonakshi Sinha

తాను నటించే సినిమాల్లో తన తల్లి జోక్యం చేసుకుంటుందని వచ్చిన కథనాలను బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తోసిపుచ్చారు. లుటేరా సినిమాలో రణవీర్ సింగ్ తో సోనాక్షి సిన్హా నటించిన కొన్ని సన్నివేశాల్లో ఆమె తల్లి పునమ్ సిన్హా జోక్యం చేసుకుందని వార్తలు వచ్చాయి. వీటిని సోనాక్షి కొట్టిపారేసింది.

'అవన్ని చెత్త కథనాలు. నేనేం పనిచేస్తున్నానో మా అమ్మకు బాగా తెలుసు. నా నటనలోని లోటుపాట్లు గురించి అమ్మకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు' అని 25 ఏళ్ల సోనాక్షి సిన్హా చెప్పింది. లుటేరా ప్రచారంలో భాగంగా కేఫ్ కాఫీ డే అవుట్ లెట్ లో జరిగిన కార్యక్రమంలో సోమవారం ఆమె పాల్గొంది.

'మా అమ్మ నా పనిలో తలదూర్చదు. ఆమెకు తలవంపులు తెచ్చే పని నేనెప్పుడు చేయను' అని సోనాక్షి సిన్హా వివరించింది.  50 దశకం నాటి కథా నేపథ్యంతో లుటేరా చిత్రం తెరకెక్కింది. విక్రమాదిత్య మోత్వానే ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.