ఉత్కంఠ రేపుతున్న అల్లరి నరేష్‌ న్యూ లుక్‌..!

19 Jan, 2020 13:23 IST|Sakshi

చాలా కాలం నుంచి హీరోగా వెండితెరకు దూరంగా ఉన్న అల్లరి నరేష్‌ సినిమా ఓ సరికొత్త సినిమాతో వస్తున్నాడు. నూతన దర్శకుడు విజయ కనకమేడల  దర్శకత్వంలో.. నరేష్‌ చేస్తున్న సినిమా పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. మొఖం నిండా గాయాలతో రక్తం కారుతుండగా.. ఎర్రటి కళ్లతో ఉన్న నరేష్‌ లుక్‌ ఉత్కంఠ రేపుతోంది. ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందనున్నట్టు తెలుస్తోంది. నరేష్‌కు ఇది 57వ సినిమా కావడం విశేషం. సతీష్‌ వేఘేష్న నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు  ఇంకా పేరు ఖరారు చేయలేదు. ఈ నెల 20న సినిమా షూటింగ్‌ ప్రారంభవుతుందని చిత్ర బృందం తెలిపింది.

ఇది లాఉండగా.. ఒకప్పుడు మినిమమ్‌ హిట్‌ గ్యారెంటీగా హీరోగా పేరు తెచ్చుకున్న నరేష్‌.. కొద్ది కాలంగా వరుస ఫ్లాపులతో ప్రేక్షులను నిరాశ పరుస్తున్నాడు. ఇక యాక్షన్‌ ప్రధానంగా రూపుదిద్దుకుంటున్న తాజా సినిమాతో ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. మరోవైపు నరేష్‌ నటించిన పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌ .. ‘బంగారు బుల్లోడు’ త్వరలో విడుదల కానుంది. గతేడాది విడుదలైన సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు హిట్‌ చిత్రం మహర్షిలో కీలక పాత్ర పోషించిన నరేష్‌ విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.
చదవండి: పంథా మార్చుకున్న అల్లరి నరేశ్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాపై క్లారిటీ ఇచ్చిన సుదీప్‌

జనవరి 31 లోగా ఫొటోలు పంపండి : సమంత

షబానాను పరామర్శించిన బాలీవుడ్‌ ప్రముఖలు

వారిద్దరి ప్రేమాయణం సోషల్‌మీడియాలో వైరల్‌

నయన, విఘ్నేశ్‌శివన్‌ల ప్రేమకథ సినిమాగా..!

సినిమా

ఉత్కంఠ రేపుతున్న అల్లరి నరేష్‌ న్యూ లుక్‌..!

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాపై క్లారిటీ ఇచ్చిన సుదీప్‌

జనవరి 31 లోగా ఫొటోలు పంపండి : సమంత

వారిద్దరి ప్రేమాయణం సోషల్‌మీడియాలో వైరల్‌

నయన, విఘ్నేశ్‌శివన్‌ల ప్రేమకథ సినిమాగా..!

నా గురించి అసత్య ప్రచారం చేస్తున్నారు: రష్మిక

-->