పంది పిల్లతో రవిబాబు సినిమా

26 Jun, 2016 08:43 IST|Sakshi
పంది పిల్లతో రవిబాబు సినిమా

అల్లరి, అవును, అనసూయ, లడ్డూ బాబు లాంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రవిబాబు. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్కు భిన్నంగా సినిమాలు చేసే రవిబాబు. ఇప్పుడు మరో ప్రయోగం చేస్తున్నాడు. దర్శక ధీరుడు రాజమౌళి ఈగ ప్రధాన పాత్రలో సినిమాను తెరకెక్కిస్తే క్రియేటివ్ డైరెక్టర్ రవిబాబు ఓ పంది పిల్ల ప్రధాన పాత్రగా సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

పూర్తిగా పంది పిల్ల చుట్టూ తిరిగే కథతో రూపొందుతున్న ఈ సినిమాతో అభిషేక్, నబా హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. ఎక్కువగా యానిమేషన్ గ్రాఫిక్స్తో రూపొందిస్తున్న ఈ సినిమాకు సురేష్ బాబు నిర్మాత. ఈ సినిమాలో పంది పిల్లను గ్రాఫిక్స్లో క్రియేట్ చేయటం కోసం దాదాపుగా 2 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.