సుకుమార్‌ బర్త్‌డే.. ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌

11 Jan, 2020 14:12 IST|Sakshi

స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ క్రియేటీవ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘అల.. వైకుంఠపురములో’  సినిమాకు సంబంధించిన అన్ని పనులు ముగిసిన వెంటనే ఈ చిత్ర సెట్స్‌లోకి బన్ని అడుగుపెట్టనున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి స్టోరీ, బన్ని క్యారెక్టర్‌ ఇదేనంటూ సోషల్‌ మీడియాలో చాలానే ప్రచారం జరుగుతోంది. దీంతో సినీ అభిమానులు ఈ చిత్రంపై ఓ రకమైన ఎగ్జైట్‌మెంట్‌ను కనబరుస్తున్నారు. తాజాగా డైరెక్టర్‌ బర్త్‌డే సందర్భంగా చిత్ర యూనిట్‌ అందరికి బిగ్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్‌ వీడియోను రిలీజ్‌ చేసింది. 

అల్లు అర్జున్‌కు ఇది 20 చిత్రం కావడంతో ‘ఏఏ20’అనే వర్కింగ్‌ టైటిల్‌ పేరుతో ఓ చిన్న వీడియోను అభిమానులకు కానుకగా అందించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది. తాజాగా విడుదల చేసిన మేకింగ్‌ వీడియో ప్రకారం ప్రస్తుతం షూటింగ్‌ కేరళ అడవుల్లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక వీడియోలో కనిపిస్తున్న భారీ జలపాతల నడుమ హీరోతో భారీ సీన్లకు సుకుమార్‌ ప్లాన్‌ చేస్తునట్లు సమాచారం. బాహుబలిలో ప్రభాస్‌ ఎంట్రీ సీన్‌కు మించి ఈ సినిమాలో బన్ని ఇంట్రడక్షన్‌ ఉంటుందని లీకువీరుల సమాచారం. 

‘నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా’ తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్‌ ఇచ్చిన బన్ని.. ఆ గ్యాప్‌ను ఫుల్‌ఫిల్‌ చేయడానికి  వరుస సినిమాలతో అభిమానులను అలరించనున్నాడు. సుకుమార్‌ సినిమా తర్వాత మురగదాస్‌, వేణు శ్రీరామ్‌, కొరటాల శివలతో అల్లు అర్జున్‌ సినిమాలు ఉండబోతున్నట్లు బన్నీ అత్యంత సన్నిహితుడు బన్నీ వాస్‌ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.  ఇక సుకుమార్‌-బన్ని కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తుండగా దేవిశ్రీప్రసాద్‌ సంగీతమందిస్తున్నాడు. రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తున్నారు. 
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కరోనాకు వ్యాక్సిన్‌ కనిపెట్టా: కార్తీక్‌ ఆర్యన్‌

బెల్లీడాన్స్ నేర్చుకుంటున్న స్టార్‌ తనయ!

వైరల్‌ ట్వీట్‌: బిగ్‌బీపై నెటిజన్ల ఫైర్‌

16 ఏళ్ల వయసులో నటుడి హఠాన్మరణం

దియా జలావొ: ‘దీపావళి అనుకున్నారేంటి?’

సినిమా

కరోనాకు వ్యాక్సిన్‌ కనిపెట్టా: కార్తీక్‌ ఆర్యన్‌

బెల్లీడాన్స్ నేర్చుకుంటున్న స్టార్‌ తనయ!

వైరల్‌ ట్వీట్‌: బిగ్‌బీపై నెటిజన్ల ఫైర్‌

16 ఏళ్ల వయసులో నటుడి హఠాన్మరణం

దియా జలావొ: ‘దీపావళి అనుకున్నారేంటి?’

రజనీ రియాలిటీ షోకు అత్యధిక రేటింగ్‌