ఇంతకంటే ఎక్కువ చెప్పలేను.. : బన్నీ

10 Jan, 2020 15:18 IST|Sakshi

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ బర్త్‌ డే సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా అరవింద్‌కు ఆయన కుమారుడు స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ‘హ్యాపీ బర్త్‌డే డాడీ.. ఎప్పటికీ నువ్వే నా ఫెవరేట్‌.. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను’ అని పేర్కొన్నారు. మెగా హీరో సాయిధరమ్‌తేజ్‌ కూడా అరవింద్‌కు బర్త్‌ డే విషెస్‌ చెప్పారు. తమకు ధైర్యం ఇవ్వడంతోపాటు.. సపోర్టింగ్‌ పిల్లర్‌గా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు. 

నువ్వే నా ఫస్ట్‌ హీరో..
హీరో అల్లు శిరీష్‌ కూడా తన తండ్రికి బర్త్‌ డే విషెస్‌ చెప్పారు. ‘హ్యాపీ బర్త్‌డే డాన్‌ కార్లియోన్‌. ఎప్పటికీ నువ్వే నా ఫస్ట్‌ హీరో. నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో, ఎంత కృతజ్ఞత ఉందో మాటల్లో వ్యక్తపరచలేను. థ్యాంక్స్‌ ఫర్‌ ఎవ్రీ థింగ్‌’ అని శిరీష్‌ పేర్కొన్నారు. 

ఇంకా రాశీ ఖన్నా, రష్మికా మందన్నా, లావణ్య త్రిపాఠి, బోయపాటి శ్రీను, శ్రీనివాస్‌రెడ్డి, గోపిచంద్‌ మలినేని, మారుతి, హరీశ్‌ శంకర్‌లతోపాటు పలువురు అరవింద్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.కాగా, ఇటీవల జరిగిన ‘అల.. వైకుంఠపురములో..’ చిత్రం ‘మ్యూజికల్‌ కన్సర్ట్‌’లో అల్లు అర్జున్‌ తన తండ్రి గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయిన సంగతి తెలిసిందే. తన తండ్రి అంత గొప్పవాడిని కాలేనంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తన తండ్రి తొలిసారిగా సభాముఖంగా ధన్యవాదాలు తెలిపారు.  సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానున్న అల.. వైకుంఠపురములో చిత్రంపై భారీ అంచనాల నెలకొన్నాయి.(అల్లు అర్జున్‌ భావోద్వేగం)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా