బన్నీ 'డిజె' అదుర్స్ సీక్వలా..?

17 Jan, 2017 16:12 IST|Sakshi
బన్నీ 'డిజె' అదుర్స్ సీక్వలా..?

సరైనోడు సినిమాతో కెరీర్లోనే బిగెస్ట్ హిట్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ షార్ట్ గ్యాప్ తరువాత హరీష్ శంకర్ దర్శకత్వంలో డిజె సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దువ్వాడ జగన్నాథమ్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన అదుర్స్ సినిమాకు సీక్వల్ అన్న టాక్ వినిపిస్తోంది. చాలా కాలంగా ఎన్టీఆర్తో అదుర్స్ సినిమాకు సీక్వల్ చేసే ఆలోచనలో ఉన్నాడు దర్శకుడు వివి వినాయక్. అయితే ఆ సినిమా కార్యరూపం దాల్చకముందే హరీష్ శంకర్ బన్నీతో ఈ సినిమా మొదలెట్టేశాడు.

డిజెలో అల్లు అర్జున్ బ్రాహ్మణుడి పాత్రలో కనిపించనున్నాడట. డైలాగ్స్తో పాటు, బాడీలాంగ్వేజ్ కూడా అలాగే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు బన్నీ. ఈ సినిమా దర్శకుడు హరీష్ శంకర్ అదుర్స్ సినిమాకు రచనా సహకారం అందించాడు. ఆ సినిమాలో చారి, బ్రహ్మీల మధ్య కామెడీ సీన్స్ను రాసింది కూడా హరీషే. అందుకే ఇప్పుడు చారీ పాత్రను పూర్తి స్థాయి కథానాయకుడిగా మార్చి దువ్వాడ జగన్నాథమ్ సినిమాను తెరకెక్కిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను సమ్మర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా