బన్ని తొలి పోస్ట్ కు సూపర్ రెస్పాన్స్

21 Nov, 2017 11:20 IST|Sakshi

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్న నా పేరు సూర్య నా ఇళ్లు ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఎప్పుడూ టచ్ ఉండే బన్నీ తాజాగా మరో సామాజిక మాధ్యమంలోకి అడుగుపెట్టాడు. ఇప్పటికే ఫేస్ బుక్, ట్విట్టర్లలో యాక్టివ్ గా ఉంటున్న బన్నీ, తాజాగా ఇన్స్ స్టాగ్రామ్ లోనూ తన ఫీలింగ్స్ ను షేర్ చేసుకోనున్నాడు.

సోమవారం తాను ఇన్స్ స్టాగ్రామ్ లో అకౌంట్ ఓపెన్ చేసినట్టుగా తెలిపిన బన్నీ, ఆ పేజ్ లో తన కూతురు అర్హా తొలి పుట్టిన రోజు సందర్భంగా తొలి పోస్ట్ చేశాడు. 'నా చిన్నారి ఏంజెల్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. అప్పుడే సంవత్సరం గడిచిపోయిందంటే నమ్మలేకపోతున్నాను' అంటూ కామెంట్ చేశాడు బన్నీ. ముద్దులొలికే అర్హా ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బన్నీ ఈ పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే 25 వేలకు పైగా లైక్స్, 1500లకు పైగా కామెంట్స్ వచ్చాయి.

Happy Birthday to my Lil Angel Arha! Can’t believe it’s One year already. Muah! #happybirthday #arha #1stbday #alluprincess #1stpost

A post shared by Allu Arjun (@alluarjunonline) on


మరిన్ని వార్తలు