టాలీవుడ్‌ దర్శకులకి గ్రాండ్‌పార్టీ ఇచ్చిన బన్నీ

3 Feb, 2020 20:14 IST|Sakshi

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అల వైకుంఠపురంలో చిత్ర సక్సెస్‌లో మునిగితేలుతున్నాడు. ఇప్పటికే చిత్ర యూనిట్‌ సక్సెస్‌ మీట్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా టాలీవుడ్‌ ప్రముఖుల కోసం బన్నీ ప్రత్యేకంగా ఓ పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ పార్టీ ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బన్నీ టాలీవుడ్‌ ప్రముఖ దర్శకులందరితో దిగిన ఫోటో వైరల్‌ అవుతోంది. ఇదిలా ఉంటే  త్రివిక్రమ్‌, అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన అల వైకుంఠపురంలో చిత్రం బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల జోరు కనబరుస్తోంది. కాగా ఈ చిత్రం ఇప్పటికే 150 కోట్ల షేర్‌కుచేరువైనట్లు తెలుస్తోంది. 

(అల.. విజయోత్సాహంలో...)

అల వైకుంఠపురంలో.. సినిమా నిర్మాతగా తన తండ్రికి కూడా భారీగా లాభాలు తీసుకొచ్చింది. ఇక బన్నీ కెరియర్‌లో అత్యధిక కలెక్షన్స్ సొంతం చేసుకున్న చిత్రంగా ఇది నిలిచిపోయింది. ఈ నేపధ్యంలో బన్నీ టాలీవుడ్ దర్శకులకోసం ఒక అదిరిపోయే పార్టీ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటో అల్లు అర్జున్ తన ట్విటర్‌లో పెట్టారు. ఈ పార్టీలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, నిర్మాత అల్లు అరవింద్‌,త్రివిక్రమ్‌తో పాటు దర్శకులు, యువ దర్శకులు, కో డైరెక్టర్లు కూడా ఈ పార్టీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది.  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కరోనా: ట్రెండింగ్‌లో ఆర్జీవీ ‘పురుగు’ పాట!

ప్రజల్లో మార్పుతోనే కరోనా దూరం: రష్మి గౌతమ్‌

నా వంతు విరాళం సేకరిస్తున్నాను

బర్త్‌డేకి టైటిల్‌?

ఇంట్లోనే ఉందాం.... కరోనాను దేశం దాటిద్దాం

సినిమా

కరోనా: ట్రెండింగ్‌లో ఆర్జీవీ ‘పురుగు’ పాట!

నా వంతు విరాళం సేకరిస్తున్నాను

బర్త్‌డేకి టైటిల్‌?

ఇంట్లోనే ఉందాం.... కరోనాను దేశం దాటిద్దాం

‘స్టార్‌ వార్స్‌’ నటుడు కరోనాతో మృతి

ఆర్జీవీ... ఓ రామబాణం