జెట్‌ స్పీడ్‌లో!

8 Jun, 2019 02:44 IST|Sakshi
అల్లు అర్జున్‌, నివేధా పేతురాజ్‌, సుశాంత్‌

అల్లు అర్జున్‌ టీమ్‌ మెంబర్స్‌ ఒక్కొక్కరుగా సెట్‌లో జాయిన్‌ అవుతున్నారు. దీంతో సినిమా షూటింగ్‌ జెట్‌ స్పీడ్‌లో సాగుతోంది. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లుఅర్జున్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ఇందులో మరో హీరోయిన్‌గా నివేధా పేతురాజ్‌ను తీసుకున్నారు. ఈమె గతంలో ‘మెంటల్‌మదిలో, చిత్రలహరి’ సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. మరో కీలక పాత్ర కోసం నటుడు సుశాంత్‌ను సెలక్ట్‌ చేసుకున్నారు టీమ్‌.

ఇందుకు సంబంధించిన అధికారిక సమాచారం శుక్రవారం వెల్లడైంది. ‘‘లొకేషన్‌లో నా ఫస్ట్‌డే మొదలైనందుకు ఆనందంగా ఉంది. ‘చిలసౌ’ తర్వాత మంచి అమేజింగ్‌ టీమ్‌తో వర్క్‌ చేస్తున్నందుకు చాలా ఎగై్జటింగ్‌గా ఉంది. సినిమా గురించి ఎక్కువగా ఇప్పుడే చెప్పలేను’’ అని సుశాంత్‌ అన్నారు. ఈ సినిమాలో టబు ఓ కీలక పాత్ర చేస్తున్నారు. అల్లు అరవింద్, ఎస్‌. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం: తమన్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: పీడీవీ ప్రసాద్‌. ఈ సినిమా కాకుండా సుకుమార్, వేణు శ్రీరామ్‌ దర్శకత్వాల్లో హీరోగా నటించనున్నారు అల్లు అర్జున్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు