‘ఏజెంట్‌’ను మెచ్చుకున్న బన్నీ

5 Jul, 2019 18:52 IST|Sakshi

డిఫరంట్‌ స్టోరీ, స్క్రీన్‌ప్లేతో హిట్‌ కొట్టడం మామూలు విషయం కాదు. కమర్షియల్‌ హంగులు దిద్దుతూనే కొత్తదనం చూపించాలంటే దర్శకుడికి ఎంతో ప్రతిభ ఉండాలి. ఈ మధ్య వచ్చిన ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ప్రేక్షకులనే కాదు సెలబ్రెటీలను సైతం మెప్పించింది. తాజాగా ఈ చిత్రంపై స్టైలీష్‌ స్టార్‌ అల్లుఅర్జున్‌ ప్రశంసలజల్లు కురిపించారు.

రీసెంట్‌గా ఈ మూవీని చూసిన బన్నీ.. సోషల్‌ మీడియాలో వేదికగా తన అభిప్రాయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ‘ ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రాన్ని చూశాను. ఇదొక మంచి హ్యూమర్‌తో కూడిన థ్రిల్లర్‌ మూవీ. కొత్త టాలెంట్‌ టాలీవుడ్‌కు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా తరుపును చిత్రబృందానికి కంగ్రాట్స్‌. థ్రిల్లర్‌ మూవీస్‌ను ఇష్టపడే వారు.. తప్పకుండా చూడాల్సిన చిత్రం’ అంటూ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న మూవీ షూటింగ్‌లో బన్నీ బిజీగా ఉన్నాడు.
 

మరిన్ని వార్తలు