బన్ని కోసం బాలీవుడ్‌ నుంచి..

12 Apr, 2020 14:23 IST|Sakshi

స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా లెక్కల మాష్టారు సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తున్నారు. బన్నీ బర్త్‌డే కానుకగా విడుదలైన టైటిల్‌ పోస్టర్‌, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ నెటిజన్లను తెగ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఊరమాస్‌ లుక్‌లో అల్లు అర్జున్‌ సూపర్బ్‌గా ఉన్నాడని విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు. అయితే అనౌన్స్‌మెంట్‌ నుంచి లీకుల బెడద తప్పడం లేదు. చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించకముందే సినిమా టైటిల్‌ నుంచి అన్ని విషయాలను లీకువీరులు సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. 

తాజాగా ఈ సినిమాలోని ఓ స్పెషల్‌ సాంగ్‌ కోసం బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశీ రౌతెలాతో చిత్రబృందం సంప్రదించారని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా బన్నీతో భారీ పోరాట సన్నివేశాలకు సుకుమార్‌ ప్లాన్‌ చేశారట. దీనిలో భాగంగా విలన్స్‌ కోసం బాలీవుడ్‌ అగ్ర నటులు సంజయ్‌ దత్‌, సునీల్‌ శెట్టి, జాకీ ష్రాఫ్‌ల పేర్లను దర్శకనిర్మాతలు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా తమిళ హీరో విజయ్‌ సేతుపతి ఈ చిత్రంలో కీలకమైన పోలీస్‌ ఆఫీసర్‌ పాత్ర పోషిస్తున్నట్లు మరో వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ప్యాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీమూవీమేకర్స్‌ నిర్మిస్తుండగా.. దేవిశ్రీప్రసాద్‌ సంగీతమందిస్తున్నాడు.

చదవండి:
పవన్‌తో మరో సినిమా.. మళ్లీ టాప్‌లోకి?
బాలయ్య సినిమాలో లేడీ విలన్‌?

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా