అల్లు అర్జున్ 'రేసుగుర్రం' టీజర్ విడుదల

7 Dec, 2013 15:27 IST|Sakshi
అల్లు అర్జున్ 'రేసుగుర్రం' టీజర్ విడుదల

జులాయి తర్వాత బన్నీ రేసుగుర్రంగా దూసుకొచ్చాడు.  ఈ చిత్రం ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. స్టయిలిస్ట్ మేకర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా టీజర్ ను సురేందర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ చిత్రం పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని రెండు పాటలు మినహా దాదాపుగా షూటింగ్ పూర్తయిపోయినట్టేనని, పోస్ట్ ప్రొడక్షన్ కూడా జరుగుతోందని దర్శకుడు తెలిపారు. నల్లమలుపు బుజ్జి, కె. వెంకటేశ్వరరావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  అల్లు అర్జున్‌ సరసన శృతి హాసన్‌ను హీరోయిన్‌గా చేస్తోంది. తమన్‌ సంగీతం అందిస్తున్నాడు.