‘డబుల్‌ కంగ్రాట్యూలేషన్స్‌ నితిన్‌’

24 Feb, 2020 12:15 IST|Sakshi

నితిన్ హీరోగా నటించిన ‘భీష్మ’ సినిమా బాక్సాఫీసు వద్ద దూసుకుపోతోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్‌లోనూ సత్తా చాటుతోంది. కాసుల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్‌ రావడంతో కలెక్షన్లు అమాంతం పెరిగిపోయాయి. మొదటిరోజే చిత్రం ఆరున్నర కోట్లకు పైగా షేర్ సాధించిన విషయం తెల్సిందే. ఇక రెండో రోజు కూడా ఈ చిత్రం ఎక్కడా తగ్గలేదు. నాలుగు కోట్ల పైచిలుకు షేర్ ను రాబట్టింది. దీంతో రెండు రోజుల్లోనే భీష్మ కలెక్షన్స్ 10 కోట్ల మార్క్ ను దాటింది. ఇక మూడవ రోజు అయిన ఆదివారం కూడా అదే రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టడంతో భీష్మ మూడు రోజులకు 14.9 కోట్ల షేర్ ను రాబట్టినట్లు తెలుస్తోంది. చాలా గ్యాప్‌ తర్వాత వచ్చిన తమ హీరో సినిమాకు హిట్‌ టాక్‌ రావడంతో నితిన్‌ ఫ్యాన్స్‌ పండుగ చేసుకుంటున్నారు.

(చదవండి : ‘భీష్మ’ మూవీ రివ్యూ)

ఇక ఈ సినిమా విజయంపై సినీ ప్రముఖులు సైతం స్పందిస్తున్నారు. స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ట్విటర్‌ వేదికగా భీష్మ టీమ్‌కు అభినందనలు తెలిపారు. భీష్మ హిట్‌ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న నితిన్‌కు పుల్‌ జోష్‌ ఇచ్చిందన్నారు. ‘డబుల్‌ కంగ్రాట్యూలేషన్స్‌  నితిన్‌.  ‘భీప్మ’ విజయంతో నీ పెళ్లి వేడుకలు మరింత సందడిగా మారనున్నాయి. సరైన సమయంలో మంచి పని జరిగింది. నిన్ను చూస్తే నాకెంతో సంతోషంగా ఉంది’ అని బన్నీ ట్వీట్‌ చేశారు. మంచి హిట్‌ సాధించినందుకుగాను దర్శకుడు వెంకీ కుడుముల, హీరోయిన్‌ రష్మీక,నిర్మాత సూర్యదేవర నాగవంశికి అభినందనలు తెలియజేస్తూ వరుస ట్వీట్లు చేశారు. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. మహాశివరాత్రి సందర్భంగా గత శుక్రవారం విడుదలైంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు