మ్యాజిక్‌ రిపీట్‌

31 Oct, 2019 00:07 IST|Sakshi
దేవిశ్రీ ప్రసాద్, రవిశంకర్, నవీన్, సుకుమార్, అల్లు అర్జున్, అల్లు అరవింద్, చెర్రీ

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా ప్రారంభోత్సవం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ చిత్రంలో రష్మికా మండన్నా కథానాయికగా నటించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించనున్నారు. ముత్తం శెట్టి మీడియా ఈ సినిమాకు సహ – నిర్మాతగా వ్యవహరిస్తోంది. ‘‘ఆర్య (2004), ఆర్య 2 (2010) సినిమాల తర్వాత నా డార్లింగ్‌ సుక్కు (సుకుమార్‌)తో మూడో సినిమా చేయబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.

మళ్లీ ఆ మ్యాజిక్‌ రిపీట్‌ అవుతుందని ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాన్నగారికి (అల్లు అరవింద్‌), దర్శకులు కొరటాల శివ, సురేందర్‌ రెడ్డిగార్లతో పాటు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఇతర అతిథులకు ధన్యవాదాలు. మైత్రీ మూవీస్, ముత్తం శెట్టి మీడియాలకు థ్యాంక్స్‌. సంగీతదర్శకుడు దేవీతో నాది ఎప్పుడూ స్పెషల్‌ కాంబినేషనే’’ అన్నారు అల్లు అర్జున్‌. ఈ సినిమాకు కెమెరా: మిర్‌స్లోవ్‌ కుబ బ్రోజెక్, లైన్‌ ప్రొడ్యూసర్‌: బాలసుబ్రహ్మణ్యం కె.వి.వి.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా