ఆల్ ‌ఇండియా రికార్డ్‌ సెట్‌ చేసిన బన్నీ

16 Jul, 2020 11:10 IST|Sakshi

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగుతో పాటు కేరళలో కూడా బన్నీకి అభిమానం గణం ఉంది. అల్లు అర్జున్‌ సినిమాలకి మలయాళంతో పాటు హిందీ భాషలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలో బన్ని సినిమాలు అన్ని కూడా ఈ రెండు భాషలలో డబ్బింగ్ అవుతూ ఉంటాయి. తెలుగులో ఏవరేజ్ అయినా సినిమాలు కూడా డబ్బింగ్ వెర్షన్‌లో మంచి హిట్ టాక్ తెచ్చుకుంటాయి. ఇక కొన్ని ప్రొడక్షన్ సంస్థలు బన్నీ ప్రతి సినిమాని హిందీలో డబ్బింగ్ చేసి విడుదల చేస్తారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ ‘సరైనోడు’ హిందీ డబ్బింగ్ వెర్షన్‌ యుట్యూబ్‌లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా ఏకంగా మూడు వందల మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి దేశంలో అత్యధిక మంది వీక్షించిన సినిమాగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. బన్నీ సినిమాకి దరిదాపులలో ఒక్క హిందీ సినిమా కూడా లేకపోవడం గమనార్హం. ఈ విషయాన్ని అనలిస్ట్‌ కమల్‌నాథ్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.(ఆటపాటల పుష్ప)
 

2016లో బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో బన్నీ ఊర మాస్‌ యాక్షన్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించింది. మరో హీరో ఆదిపిని శెట్టి ఈ చిత్రంలో విలన్‌ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం బన్నీ, సుకుమార్‌ దర్శకత్వంలో పుష్ప చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.(బన్నీని ఒక్క ఛాన్స్‌ అడిగిన బాలీవుడ్‌ డైరెక్టర్‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా