ఏడు కోట్ల ఫాల్కన్‌!

6 Jul, 2019 00:15 IST|Sakshi
అల్లు అర్జున్‌

అల్లు అర్జున్‌ స్టైలిష్‌ స్టార్‌. సినిమాల్లో లుక్‌ నుంచి కాస్ట్యూమ్స్‌ వరకు అన్ని విషయాల్లో స్టైలిష్‌గా ఉండేలా జాగ్రత్త పడతారు. ఇప్పుడు కేరవాన్‌ని కూడా చాలా స్టైలిష్‌గా డిజైన్‌ చేయించుకున్నారు. షూటింగ్‌ చేస్తూ బ్రేక్‌ సమయాల్లో స్టార్స్‌ తమకోసం ప్రత్యేకంగా కేటాయించిన వాహనాల్లో విశ్రాంతి తీసుకుంటారు. అదే ‘కేరవాన్‌’. మామూలుగా నిర్మాతలే వాహనం సమకూరుస్తుంటారు. కొందరు స్టార్స్‌ సొంత కేరవాన్‌ ఏర్పాటు చేసుకుంటారు. అల్లు అర్జున్‌ తన కేరవాన్‌ను సరికొత్త ఫీచర్స్‌తో డిజైన్‌ చేయించారని తెలిసింది.

‘‘360 డిగ్రీలు తిరిగే కుర్చీ, మూడ్‌ లైటింగ్, సన్‌ రూఫ్, గేమింగ్‌ జోన్, ఎల్‌ఈడీ లైటింగ్‌తో మేకప్‌ మిర్రర్‌’ ఈ కేరవాన్‌ స్పెషాలిటీ. వీటికి తోడు మల్టీ పర్పస్‌ లాంజ్, బాత్‌రూమ్‌ దేనికదే సపరేట్‌గా ఉండేలా డిజైన్‌ చేశారు. మల్టీపర్పస్‌ లాంజ్‌ను సరికొత్త లుక్‌ వచ్చేలా డిజైన్‌ చేశారు. కొత్త కేరవాన్‌ గురించి అల్లు అర్జున్‌ తన ట్వీటర్‌లో ‘‘జీవితంలో నేనేదైనా ఖరీదైన వస్తువుని కొనుగోలు చేసిన ప్రతిసారీ నా మనసులో ఒకటే ఆలోచన మెదులుతుంది. ప్రజలు నా మీద ఎంతో ప్రేమ చూపించారు. అంత ప్రేమను చూపించబట్టే ఇలాంటివి కొనగలుగుతున్నాను. అందరికీ థ్యాంక్స్‌. కృతజ్ఞుడ్ని. దీని (కేరవాన్‌) పేరు ఫాల్కన్‌’’ అన్నారు. ఇంతకీ ఈ లగ్జరీ కేరవాన్‌ ఖరీదు ఎంతో తెలుసా? దాదాపు 7 కోట్లు అని సమాచారం. ఇదిలా ఉంటే ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు