ఫిజికల్‌ డిస్టెన్స్‌.. సెల్ఫీ

9 Apr, 2020 07:59 IST|Sakshi

బంజారాహిల్స్‌:  కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా దేశమంతా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో సినీ తారలంతా ఇళ్ళకే పరిమితమై స్వీయ గృహ నిర్బంధంలో గడుపుతున్నారు. సినీ హీరో అల్లు అర్జున్‌ పుట్టిన రోజు వేడుకలు జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో నిరాడంబరంగా జరిగాయి. కొద్దిమంది అభిమానులు మాత్రమే ఆయనను కలిసి భౌతికదూరాన్ని పాటిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. కొంత మంది అభిమానులు భౌతికదూరాన్ని పాటిస్తూనే సెల్ఫీలు దిగారు. ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో అభిమానులతో పాటు అల్లు అర్జున్‌ కూడా పోస్ట్‌ చేశారు. (బన్ని అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన సుకుమార్‌)

మరిన్ని వార్తలు