చెఫ్‌గా మారిన బన్నీ కొడుకు

13 May, 2020 18:43 IST|Sakshi

హీరో అల్లు అర్జున్‌ పిల్లలు అయాన్‌, అర్హలు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. వీరి అల్లరికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను బన్నీ, అతని భార్య స్నేహారెడ్డిలు పలు సందర్బాల్లో సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. అయితే ఈ సారి మాత్రం అయాన్‌ కొత్తగా చెఫ్‌ అవతారం ఎత్తాడు. సలాడ్‌ తయారు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను స్నేహ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. (చదవండి : బుట్టబొమ్మకు పెదవి కలిపిన బుట్టబొమ్మ)

ఈ వీడియోలో అయాన్‌ సలాడ్‌ ఎలా తయారు చేయాలో వివరించే ప్రయత్నం చేశాడు. ఈ సలాడ్‌ మనకు చాలా విటమిన్‌లను అందజేసి.. శరీరాన్ని బలంగా చేస్తుందని చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో అయాన్‌ క్యూట్‌నెస్‌ చూసిన బన్నీ అభిమానుల మురిసిపోతున్నారు. ఇటీవల బన్నీ కుమార్తె అర్హ.. బుట్టబొమ్మ సాంగ్‌కు లిప్‌ సింక్‌ ఇచ్చిన వీడియో కూడా వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. (చదవండి : ‘రాములో రాములా’.. మరో రికార్డు)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు