ఫారిన్‌ పోదాం రాములా!

23 Oct, 2019 01:43 IST|Sakshi

అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అల.. వైకుంఠపురములో...’. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అరవింద్, ఎస్‌. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాలోని ‘రాములో.. రాములా..’ సాంగ్‌ టీజర్‌ను మంగళవారం విడుదల చేశారు. పూర్తి పాటను ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వచ్చే నెల ప్రథమార్ధంలో విదేశాల్లో చిత్రీకరణ జరిపేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోందని సమాచారం. సుశాంత్, నివేదా పేతురాజ్, టబు, జయరామ్‌ కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు తమన్‌ స్వరకర్త. ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది.

>
మరిన్ని వార్తలు