సంక్రాంతికి సై

11 Jul, 2019 02:13 IST|Sakshi
అల్లు అర్జున్‌

సంక్రాంతి బరిలో తాను ఉన్నానంటున్నారు అల్లు అర్జున్‌. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అల్లు అరవింద్, ఎస్‌. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు బుధవారం చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. ఈ సినిమాకు పీడీవీ ప్రసాద్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌. టబు, సుశాంత్, నివేతా పేతురాజ్‌ కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు ఎస్‌.ఎస్‌. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ‘జులాయి’ (2012), ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ (2015) సినిమాల తర్వాత త్రివిక్రమ్‌ – అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు