‘రేసుగుర్రం’ రిపీట్‌ కానుందా?

26 May, 2020 14:13 IST|Sakshi

స్టై​లీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌-సురేందర్‌ రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘రేసుగుర్రం’. అన్ని వర్గాల ప్రేక్షకులను ఫుల్‌ ఎంటర్‌టైన్‌ చేసిన ఈ చిత్రం అప్పట్లో రికార్డుల సునామీ సృష్టించింది. అయితే టాలీవుడ్‌ సర్కిళ్లలో తెగ చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం ఈ కాంబినేషన్‌ మళ్లీ​ రిపీట్‌ కానుందట. ‘రేసుగుర్రం’ చిత్రానికి కథను అందించిన వక్కంతం వంశీతో కలిసి బన్ని కోసం ఓ కథను స్దిదం చేస్తున్నారట సురేందర్‌ రెడ్డి. ‘రేసుగుర్రం’కు మించిన పవర్‌ఫుల్‌ స్క్రిప్ట్‌ను సిద్దం చేసే పనిలో వంశీ-సురేందర్‌ ఉన్నట్లు టాలీవుడ్‌ సమాచారం. 

ఇక ప్రస్తుతం పుష్ఫ చిత్రంతో బిజీగా ఉన్న బన్ని ఆ తర్వాత వేణు శ్రీరామ్‌ ‘ఐకాన్‌’కు కమిట్‌ అయిన విషయం తెలిసిందే. సుకుమార్‌ ‘పుష్ప’ తర్వాత ఐకాన్‌ సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇక ఈ రెండు చిత్రాల తర్వాత అల్లు అర్జున్‌తో ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించాలని సురేందర్‌ రెడ్డి భారీగా ప్లాన్‌ చేస్తున్నారట. ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం తర్వాత సురేందర్‌ రెడ్డి మరో చిత్రాన్ని ఇప్పటివరకు ఫైనలైజ్‌ చేయలేదు. పలువురు హీరోలతో కథాచర్చలు జరిపినప్పటికీ కుదరలేదని టాలీవుడ్‌ టాక్‌.  ఇక వీరిద్దరి కలయికలో మరో చిత్రం రావాలని బన్ని అభిమానులు ఎప్పట్నుంచో కోరుకుంటున్న విషయం తెలిసిందే. రేసుగుర్రం కాంబినేషన్‌ మళ్లీ రిపీట్‌ అవుతుందా? లేదా అని తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాలి.   

చదవండి:
హీరోయిన్‌ మెటీరియల్‌ కాదన్నారు
యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో ‘నో పెళ్లి’

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా