ఊటీలో హుషారుగా..!

6 Oct, 2014 23:18 IST|Sakshi
ఊటీలో హుషారుగా..!

 కొంటె పాత్రలు, అల్లరి పాత్రలు చేయడంలో అల్లు అర్జున్ ప్రత్యేకతే వేరు. ఇక త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్ గురించి కొత్తగా చెప్పేదేముంది. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘జులాయి’ ప్రేక్షకులను ఫుల్ ఎంటర్‌టైన్ చేసింది. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా మొదలైంది. గత నెలాఖరున ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆరంభమైంది. అల్లు అర్జున్ శారీరక భాషకు తగ్గట్టుగా, తనదైన శైలిలో త్రివిక్రమ్ ఈ చిత్రం చేస్తున్నారు. ఇందులో అల్లు అర్జున్ సరసన సమంత, అదా శర్మ, ప్రణీత కథానాయికలుగా నటిస్తున్నారు.
 
  ఈ ముగ్గురితోనూ బన్నీకి ఇది తొలి చిత్రం అయితే, ‘అత్తారింటికి దారేది’ తర్వాత సమంత, ప్రణీతలతో త్రివిక్రమ్ చేస్తున్న చిత్రమిది. ఇంకా ఈ చిత్రంలో ఓ కీలక పాత్రను స్నేహ చేయడం విశేషం. విభిన్న పాత్రలు పోషిస్తారని పేరు తెచ్చుకున్న ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర ఇందులో ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ఊటీలో జరుగుతోంది. ఎస్. రాధాకృష్ణ ఈ చిత్రానికి నిర్మాత. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందిస్తున్నారు.