నిర్మాతగా మారనున్న అల్లు అర్జున్‌..!

8 Jan, 2019 10:43 IST|Sakshi

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తరువాత లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్న స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, తన తదుపరి చిత్రం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఉండబోతుందని ఇటీవల ప్రకటించారు. అయితే ఈ గ్యాప్‌ లో ఆయన ఇతర రంగాల మీద దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం హీరోగా ఫుల్‌ ఫాంలో ఉన్న బన్నీ త్వరలో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇప్పటికే అల్లు ఫ్యామిలీ నుంచి గీతా ఆర్ట్స్‌, గీతా ఆర్ట్స్‌ 2 బ్యానర్‌పై సినిమాలను నిర్మిస్తున్నారు.

అయితే బన్నీ అందుకు భిన్నంగా సినిమాలు కాకుంగా బుల్లితెర మీద దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి బుల్లితెరపై కూడా గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లోనే షోస్‌ నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారట. అయితే బన్నీ నిర్మాణంలో సీరియల్స్‌ను నిర్మిస్తారా..? లేక రియాలిటీ షోస్‌ నిర్మిస్తారా అన్న విషయం తెలియాల్సి ఉంది. నా పేరు సూర్య ఫ్లాప్‌ అవ్వడంతో ఆలోచనలో పడ్డ బన్నీ, త్రివిక్రమ్‌ సినిమా కోసం మేకోవర్‌ అవుతున్నాడు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రేమ సులభం కాదు

అమెరికాలో అతను డాక్టర్‌ కపూర్‌

ప్రయాణం అద్భుతంగా సాగింది

ఫుల్‌ నెగెటివ్‌

మల్టీస్టారర్‌ లేదట

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రేమ సులభం కాదు

ప్రయాణం అద్భుతంగా సాగింది

ఫుల్‌ నెగెటివ్‌

మల్టీస్టారర్‌ లేదట

మా కష్టమంతా మర్చిపోయాం

ఆనంద భాష్పాలు ఆగలేదు