పొలిటికల్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో బన్నీ సినిమా!

14 Jul, 2020 17:26 IST|Sakshi

హైదరాబాద్‌: స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ మరో కొత్త ప్రాజెక్టు ఒకే చెప్పినట్లు సమాచారం. ‘యాత్ర’ ఫేం డైరెక్టర్‌ మహి ఆర్‌ రాఘవ దర్శకత్వంలో నటించేందుకు బన్నీ ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో వస్తున్న ‘పుష్ప’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. దీంతో లాక్‌డౌన్‌లో మరో క్రేజీ స్క్రిప్ట్‌ కోసం ఎదురుచుస్తున్న బన్నీకి దర్శకుడు ఆర్‌ రాఘవ స్క్రిప్ట్‌ వినిపించడంతో గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం.   
చదవండి: అందుకే ‘పుష్ప’ నుంచి తప్పుకున్నా: విజయ్

ఈ చిత్రం పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో ఇటీవల చోటుచేసుకున్న వాస్తవిక సంఘటన ఆధారం తెరకెక్కనుందని తెలుస్తోంది. మొదటిసారిగా బన్నీ-మహీ కాంబినేషన్‌లో ఈ క్రేజీ ప్రాజెక్టుకు ప్రసాద్‌ వి పొట్లూరి నిర్మించేందుకు ఆసక్తిని చూపినట్లు టాలీవుడ్‌ టాక్‌. ప్రస్తుతం అల్లు అర్జున్‌ నటిస్తున్న పుష్ప సినిమా షూటింగ్‌ తిరిగి ప్రారంభించిన తర్వాత ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అల్లు అర్జున్ పుట్టిన రోజు (ఏప్రిల్ 8), పుష్ప నిర్మాతలు ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఫస్ట్‌కు సోషల్‌ మీడియాలో మంచి రెస్పాన్స్‌ వచ్చింది. (చదవండి: బన్నీని ఒక్క ఛాన్స్‌ అడిగిన బాలీవుడ్‌ డైరెక్టర్‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా