రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన మెగా హీరో

30 May, 2018 11:02 IST|Sakshi

మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అయిన యంగ్ హీరో అల్లు శిరీష్‌ సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. కెరీర్‌ను గాడిలో పెట్టే సక్సెస్‌ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఈ యంగ్ హీరో త్వరలో ఓ రీమేక్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. కొద్ది రోజులుగా శిరీష్‌ చేయబోయే ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్ విషయంలో రకరకాల వార్తలు ఫిలిం నగర్‌లో వినిపిస్తున్నాయి.

ఈ వార్తలపై శిరీష్ క్లారటీ ఇచ్చాడు. కొద్ది రోజులుగా తాను శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాట్టుగా వస్తున్న వార్తలు రూమర్స్‌ అంటూ కొట్టి పారేశాడు‌. ఈ మధ్య కాలంలో ఎప్పుడు శ్రీకాంత్ అడ్డాలను కలవలేదని క్లారిటీ ఇచ్చారు. శిరీష్‌ ప్రస్తుతం తెలుగులో ఏబీసీడీ రీమేక్‌తో పాటు సూర్య హీరోగా కేవీ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.

మరిన్ని వార్తలు