సెల్ఫీలు ఎవ్వరికీ ఊరికే రావు! 

3 Jul, 2018 13:05 IST|Sakshi

ఈ మాట వింటుంటే ఎక్కడో విన్నట్టుంది కదూ. కాకపోతే సెల్ఫీలకు బదులు అక్కడ డబ్బులు అని ఉంటుంది. ‘అవును మరి డబ్బులు ఎవ్వరికీ ఊరికే రావు’..  ఈ మాటని టీవీ యాడ్స్‌లో పదేపదే చెప్పి, తన వేషదారణతో ఫేమస్‌ అయ్యారు లలితా జ్యువెలర్స్‌ యజమాని కిరణ్‌ కుమార్‌.

అయితే గతకొంతకాలం నుంచి ఈ యాడ్‌ టీవీల్లో పెద్దగా కనిపించటం లేదు. అయినా సరే ఈయన చెప్పిన డైలాగ్‌ను మాత్రం జనం మరిచిపోలేదు. తాజాగా మెగా హీరో అల్లు శిరీష్‌.. ఈయన్ను ఎయిర్‌పోర్ట్‌లో కలిసినప్పుడు ఓ సెల్ఫీ దిగి ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ‘సెల్ఫీలు ఎవ్వరికీ ఊరికే రావు! లక్‌ ఉండాలి. హహ అంటూ.. ఎయిర్‌పోర్ట్‌లో కలిశాను .. ఓ సెల్ఫీ అడిగాను’ అంటూ కిరణ్‌తో కలిసి దిగిన ఫొటోను ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు