నిజమైన యోధుడు

3 Feb, 2019 06:01 IST|Sakshi
పి. సునీల్‌ కుమార్‌ రెడ్డి

మన్యంలో జరుగుతున్న తెల్లదొరల అకృత్యాలకు నిరసనగా విప్లవ బావుటా ఎగరవేసిన  అల్లూరి సీతారామరాజు పోరాట గాథ ‘సీతారామరాజు’ పేరుతో తెరకెక్కనుంది. ఉపశీర్షిక ‘ఎ ట్రూ వారియర్‌’. ‘సొంత ఊరు, గంగపుత్రులు, గల్ఫ్, రొమాంటిక్‌ క్రైమ్‌ కథ, క్రిమినల్‌ ప్రేమ కథ’ వంటి చిత్రాలను తెరకెక్కించిన పి. సునీల్‌ కుమార్‌ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. డా. శ్రీనివాస్‌ నిర్మించనున్న ఈ సినిమా మార్చిలో స్టార్ట్‌ కానుంది. ‘‘యువతకి స్ఫూర్తి నింపేలా, అల్లూరిత్యాగం, కీర్తిని మరింత ఇనుమడింపజేసేలా ఈ  సినిమా ఉంటుంది’’ అన్నారు దర్శక– నిర్మాతలు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: యెక్కలి రవీంద్రబాబు, డా.ఎల్‌.ఎన్‌.రావు, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: బాపిరాజు.

మరిన్ని వార్తలు