అల్లూరి పాత్రలో గౌతమ్.?

18 Aug, 2016 12:45 IST|Sakshi
అల్లూరి పాత్రలో గౌతమ్.?

సూపర్ స్టార్ కృష్ణ హీరోగా తెరకెక్కిన భారీ బ్లాక్ బస్టర్ సినిమా అల్లూరి సీతారామరాజు. స్వాతంత్య్ర సమర యోథుడు అల్లూరి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు సినీ చరిత్రలోనే మైల్ స్టోన్గా నిలిచిపోయింది. కృష్ణ తరువాత మరే నటుడు అల్లూరి పాత్రలో నటించేందుకు సాహసించని స్థాయిలో సూపర్ స్టార్ అల్లూరి పాత్రకు జీవం పోశాడు. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన ఇన్నేళ్ల తరువాత అదే నేపథ్యంతో మరో చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

అల్లూరి సీతారామరాజు బాల్యం, అతడు మన్యం వీరుడిగా మారటానికి దారి తీసిన సంఘటనల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. గులాబి, అనగనగా ఒక రోజు లాంటి థ్రిల్లర్ సినిమాలకు కథ అందించిన నడిమింటి నరసింగరావు, అల్లూరి సీతారామరాజు  ప్రీక్వల్కు కథ రెడీ చేశారు. ఈ సినిమాలో సూపర్ స్టార్ మనవడు, మహేష్ బాబు కొడుకు గౌతమ్ను లీడ్ రోల్లో నటింప చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ఇప్పటికే వన్ నేనొక్కడినే సినిమాలోతండ్రితో కలిసి తెరను పంచుకున్న గౌతమ్, తాత చేసిన అల్లూరి పాత్రలో కనిపిస్తాడో లేదో చూడాలి.