హీరోయిన్ కావాలని ఎప్పుడూ అనుకోలేదు

3 Aug, 2016 16:57 IST|Sakshi
హీరోయిన్ కావాలని ఎప్పుడూ అనుకోలేదు

ముంబై: డాక్టర్ కావాలనుకుని యాక్టరయ్యానని చాలామంది చెబుతుంటారు. బాలీవుడ్ భామ జరీన్ ఖాన్ మాత్రం సింగర్ కావాలనుకుని హీరోయిన్ అయ్యానని చెబుతోంది. చిన్నతనంలో తాను సింగర్ కావాలని కలలు కన్నానని, నటి కావాలని ఎప్పుడూ కోరుకోలేదని జరీన్ చెప్పింది. ఓ మ్యూజిక్ వీడియో ప్రారంభకార్యక్రమంలో పాల్గొన్న జరీన్ మాట్లాడుతూ.. భవిష్యత్లో అవకాశం వస్తే తప్పకుండా పాడుతానని అంది. ఎప్పుడైనా పాటలు పాడే అవకాశం వచ్చిందా అన్నా మీడియా ప్రశ్నకు ఇంతవరకూ రాలేదని జరీన్ బదులిచ్చింది.


2010లో జరీన్‌ ఖాన్‌ బాలీవుడ్‌కు పరిచయమైంది. ఈ సినిమాలో కండలవీరుడు సల్మాన్ ఖాన్ సరసన యువరాణి యశోధరగా కనిపించి అలరించింది జరీన్‌. ఆ తర్వాత కూడా సల్మాన్‌ హీరోగా వచ్చిన 'రెడీ' సినిమాలో ఈ భామ స్పెషల్ అపిరియన్స్ ఇచ్చింది. ఇటీవల హేట్ స్టోరీ 3లో నటించింది.