తల్లీ కొడుకు

2 Nov, 2019 03:11 IST|Sakshi

వెండితెరకు కాస్త దూరంగా ఉంటున్న అమల ‘మనం’ (2014) సినిమాలో అతిథి పాత్రలో కనిపించారు. ఈ సినిమా కంటే ముందు 2012లో వచ్చిన ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌’ సినిమాలో అమల కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఓ వెబ్‌ సిరీస్‌లో కూడా నటించారామె. కథ, పాత్ర నచ్చడంతో తాజాగా మరో సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. శర్వానంద్‌ హీరోగా శ్రీ కార్తిక్‌ దర్శకత్వంలో ఎస్‌. ఆర్‌ ప్రకాశ్‌బాబు, ఎస్‌.ఆర్‌. ప్రభు ఓ ద్విభాషా (తెలుగు, తమిళ) చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

ఇందులో రీతూ వర్మ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాలో శర్వానంద్‌ తల్లి పాత్రలో నటించనున్నారు అమల. తండ్రి పాత్రలో సంగీతదర్శకుడు అనిరు«ద్‌ రవిచంద్రన్‌ తండ్రి, నటుడు రవి రాఘవేంద్ర నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. శర్వానంద్, అమల, రవి పాత్రలపై కీలక సన్నివేశాలు తీస్తున్నారు. ‘‘స్నేహం, ప్రేమల మధ్య విడదీయరాని బంధాన్ని తెలియజేసేలా ఈ సినిమా ఉంటుంది. వచ్చే వేసవిలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మ‌ళ్లీ అడ్డంగా దొరికిన న‌టి, ఇదిగో ఫ్రూఫ్‌..

‘నాలుగో సింహం ఎవరో చెప్పిన సాయి కుమార్‌’

ఆర్జీవీ: రోజూ గిల్లే వాడు

మరో సింగర్‌కు కరోనా పాజిటివ్‌!

కరోనాపై పోరాటం: ‘సుకుమార్‌ సర్‌ మీకు సెల్యూట్‌’

సినిమా

మ‌ళ్లీ అడ్డంగా దొరికిన న‌టి, ఇదిగో ఫ్రూఫ్‌..

‘నాలుగో సింహం ఎవరో చెప్పిన సాయి కుమార్‌’

ఆర్జీవీ: రోజూ గిల్లే వాడు

మరో సింగర్‌కు కరోనా పాజిటివ్‌!

జోర్డాన్ ఎడారిలో చిక్కుకున్న‌ టాప్‌ హీరో

కరోనాపై కీరవాణి కదిలించే పాట..