అంచనాలు పెంచేసిన అమలాపాల్‌..!

5 Sep, 2018 14:01 IST|Sakshi
అమలా పాల్‌ నటిస్తోన్న ఆదాయి చిత్రం ఫస్ట్‌ లుక్‌

అమలా పాల్‌​ కథానాయకిగా నటిస్తున్న అ‘దో అంధ పరవాయి పోలా’ చిత్రం షూటింగ్‌ పూర్తి కావొచ్చినట్లు సమాచారం. ఈ సినిమా ఇంకా సెట్స్‌ మీద ఉండగానే అమలా హీరోయిన్‌గా మరో చిత‍్రం తెరకెక్కుతోంది. అమలా పాల్‌ ‘మేయాధా మన్’ ఫేం దర్శకుడు రత్న కుమార్‌ తెరకెక్కిస్తోన్న ‘ఆదాయి’ చిత్రంలో నటిస్నున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ని హీరో రానా దగ్గుబాటి తన ట్విటర్‌ ద్వారా విడుదల చేశారు. థ్రిల్లర్‌ కథాంశంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం తన ఫస్ట్‌ లుక్‌తోనే ప్రేక్షకుల అంచనాలను విపరీతంగా పెంచేస్తోంది.

ఈ పోస్టోర్‌లో అమల పాల్‌  తన జీవితాన్ని కాపాడే ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తు ఉన్నారు. అంతేకాక పోస్టర్‌లో ఆమెని విపరీతంగా కొట్టినట్లు, రక్తం కారుతూ, చిరిగిన బట్టల్లో, హృదయవిదారకంగా ఏడుస్తూ ఉన్నారు. ఆర్టిస్టిక్‌ ఫిల్మ్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రొడక్షన్‌ స్టేజ్‌లో ఉంది. దర్శకుడు రత్న కుమార్‌ గతేడాది ‘మేయాధా మన్’ చిత్రం ద్వారా తమిళ పరిశ్రమకు పరిచయమయ్యాడు. ఈ సినిమా ఘన విజయం సాధించింది. ‘ఆదాయి’ ఈ దర్శకునికి రెండో చిత్రం.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

శ్రీకాంత్‌ అడ్డాలతో నాని?

కెప్టెన్‌ ఖుదాబక్ష్‌

నిజమైన ప్రేమ

గురువారం గుమ్మడికాయ

అందుకే మెగాస్టార్‌ అయ్యారు  – తమ్మారెడ్డి 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కథ ముఖ్యం అంతే! 

డాడీ కోసం డేట్స్‌ లేవ్‌!

దాచాల్సిన అవసరం లేదు!

గురువారం గుమ్మడికాయ

శ్రీకాంత్‌ అడ్డాలతో నాని?

కెప్టెన్‌ ఖుదాబక్ష్‌