కామిని పోరాటం

1 Jul, 2019 05:27 IST|Sakshi
అమలాపాల్‌

అమలాపాల్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ఆడై’ (తెలుగులో ‘ఆమె’). ‘మేయాద మాన్‌’ ఫేమ్‌ రత్నకుమార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆర్జే రమ్య, వివేక్‌ ప్రసన్న ముఖ్య పాత్రధారులు. విజ్జి సుబ్రమణియన్‌ నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అమలాపాల్‌ బోల్డ్‌ క్యారెక్టర్‌ చేశారు. ఆమె పాత్ర పేరు కామిని అని తెలిసింది. తాజాగా ‘అడై’ సినిమాను జూలై 19న విడుదల చేయనున్నట్లు అమలాపాల్‌ వెల్లడించారు. ‘‘నేను పోరాడతాను. జీవిస్తాను. వచ్చిన అడ్డంకులు చిన్నవైనా, పెద్దవైనా ఎదుర్కొంటాను. నీ సంకల్ప బలం బలీయమైనది అయినప్పుడు నువ్వు విఫలమయ్యే అవకాశమే లేదు’’ అని సినిమాలోని తన క్యారెక్టర్‌ ఎలా ఉండబోతోందో హింట్‌ ఇచ్చారు  అమలాపాల్‌.

మరిన్ని వార్తలు