నగ్నంగా ఇరవై రోజులు!

22 Jun, 2019 08:24 IST|Sakshi

తమిళసినిమా: ఇప్పుడు కోలీవుడ్‌లో చర్చ అంతా నటి అమలాపాల్‌ గురించే. అందుకు కారణం ఈ సంచలన నటి నటించిన ఆడై చిత్రంలో పోషించిన పాత్రనే.  కథనాయకి ఇతివృత్తంతో కూడిన చిత్రం ఇది. ఇంతకుముందు మేయాదమాన్‌ వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రం ద్వారా పరిచయం అయిన రతన్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న రెండో చిత్రం ఆడై. ఆ మధ్య విడుదలైన ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టరే సంచలనం సృష్టించింది. దుస్తులు లేకుండా ఒంటికి టాయిలెట్‌ పేపర్‌ చుట్టుకున్న అమలాపాల్‌ ఫొటోతో కూడిన ఆ పోస్టర్‌ ఆడై చిత్రంపై ఆసక్తిని రేకెత్తించింది. ఇటీవల విడుదల చేసిన ఆడై చిత్ర టీజర్‌ మరింత ప్రకంపనలను సృష్టిస్తోంది.

అందులో నటి అమలాపాల్‌ పూర్తి నగ్నంగా కూర్చుని ఏడుస్తున్న దృశ్యం చోటు చేసుకోవడమే కారణం. అలాంటి సన్నివేశంలో అమలాపాల్‌ ధైర్యంగా నటించడం చర్చనీయాంశంగా మారింది. చిత్రంలో అలాంటి సన్నివేశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సన్నివేశాల కోసం నటి అమలాపాల్‌ 20 రోజులు దుస్తుల్లేకుండా నటించిందట. ఇది సాధారణ విషయం కాదు. అందుకు అమలాపాల్‌ ధైర్యాన్ని  నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. నటి సమంత వంటి తారలు అమలాపాల్‌ను అభినందిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ విడుదలైన కొన్ని గంటల్లోనే పలు మిలియన్ల ప్రేక్షకులు వీక్షించడం విశేషం. ఇలా ఇంతకుముందు ఏ చిత్రానికి రానట్టుగా లైక్స్‌ రికార్డు స్థాయిలో వచ్చాయట. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సెన్సార్‌ ఏ సర్టిఫికెట్‌ను ఇచ్చింది. ఆడై చిత్రం ఒక వ్యక్తి స్వేచ్ఛ, సంప్రదాయాల గురించి చర్చించే విధంగా ఉంటుందని చిత్ర యూనిట్‌ వర్గాలు అంటున్నారు. ఇందులో అమలాపాల్‌ నగ్నంగా నటించడం వంటి సన్నివేశాలతో పాటు, మోటార్‌ బైక్‌ నడపడం, విలన్లతో ఫైట్‌ చేయడం వంటి సాహసాలు చేసిందట. ఇది కచ్చితంగా ఆమె కేరీర్‌లో ముఖ్యమైన చిత్రంగా నిలిచిపోతుందని ఆడై చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ చిత్రం త్వరలోనే తెరపైకి వచ్చే అవకాశం ఉంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు