అది శాశ్వతం కాదు

19 Aug, 2018 03:30 IST|Sakshi
అమలాపాల్‌

ఇండస్ట్రీలో స్టార్‌ స్టేటస్‌ను సొంతం చేసుకోవాలని చాలామంది హీరోయిన్స్‌ కోరుకుంటుంటారు. కానీ ఆ స్టేటస్‌ పై తనకు సరైన అభిప్రాయం లేదని చెబుతున్నారు అమలాపాల్‌. ఎందుకు? అని అడిగితే... ‘‘స్టార్‌ హోదాలో ఉన్నాను అన్న ఫీలింగ్‌ కంటే యాక్టర్‌గా ఎదుగుతున్నాను అన్న భావనే నాకు సంతృప్తిని ఇస్తుంది. అప్పుడే మరిన్ని కొత్త విషయాలు నేర్చుకోగలుగుతాను. స్టార్‌డమ్‌ శాశత్వం కాదు. అది ఎక్కువ కాలం ఉండదు. లైఫ్‌లో అదొక ఫేజ్‌ మాత్రమే.

నా వివాహ బంధాన్ని తెగతెంపులు చేసుకున్న తర్వాత నాతో నటించడానికి కొందరు స్టార్‌ హీరోలు అంగీకరంచలేదు. ఆశ్చర్యం వేసింది. సినిమాల కోసం ఎంతటి రిస్క్‌ అయినా తీసుకుంటాను. సినిమాపై నాకు ఉన్న ప్రేమ అలాంటిది’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘తమిళ నటుడు విజయ్‌ సేతుపతికి నేను పెద్ద అభిమానిని. ఆయన ఎక్కడినుంచో ఇండస్ట్రీకి వచ్చి గొప్ప స్థాయికి  ఎదిగారు. నేను కూడా ఆయనలా మంచి యాక్టర్‌ కావాలనుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు అమలాపాల్‌.

మరిన్ని వార్తలు