జెర్సీ రీమేక్‌లో ఓకేనా?

10 Aug, 2019 06:13 IST|Sakshi

సినిమా: నటి అమలాపాల్‌కు మరో కొత్త అవకాశం ఎదురు చూస్తోందన్నది తాజా సమాచారం. ఆడై చిత్రంతో హీరోయిన్‌ ఓరియేంటేడ్‌ చిత్రాల నటిగా మారింది ఈ మలయాళ బ్యూటీ. ఆడై చిత్రంలో నగ్నంగా నటించి విమర్శలు, వివాదాలతో బోలెడు ప్రచారం పొందేసిన ఈ అమ్మడు ఈ చిత్ర విడుదలకు ఆర్థికంగా ఆదుకుని మంచి ఇమేజ్‌ను కొట్టేసింది. ఇక ఆడై చిత్రం విడుదలయ్యి మంచి టాక్‌నే తెచ్చుకుంది. మొత్తం మీద హీరోయిన్‌ ఓరియేంటేడ్‌ చిత్రాల నాయకిగా ముద్ర వేసుకునేసింది. ప్రస్తుతం మరో హీరోయిన్‌ సెంట్రిక్‌ చిత్రం ‘అదో అంద పరవై పోల’ చిత్రంలో నటిస్తోంది. కడవర్‌ అనే మరో మలయాళ చిత్రం చేతిలో ఉంది. కాగా తాజాగా మరో తమిళ చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని తెలిసింది.

తెలుగులో మంచి విజయాన్ని సాధించిన చిత్రం జెర్సీ. నిరాశలో ఉన్న నటుడు నానీలో ఉత్సాహాన్ని నింపిన చిత్రం అది. ఇప్పుడా చిత్రం తమిళంలో రీమేక్‌ కానుంది. ఇందులో నానీ నటించిన పాత్రలో నటుడు విష్ణు విశాల్‌ నటించనున్నారు. ఇక హీరోయిన్‌గా సంచలన నటి అమలాపాల్‌ను ఎంపిక చేయడానికి చర్చలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. దీనికి నెల్సన్‌ వెంకటేశన్‌ దర్శకత్వం వహించనున్నారు. ఈయన ఇంతకు ముందు ఒరునాళ్‌ కూత్తు, మాన్‌స్టర్‌ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. తెలుగు చిత్రం జెర్సీలో నటి శ్రద్ధాశ్రీనాథ్‌ పోషించిన పాత్రను తమిళంలో నటి అమలాపాల్‌ చేసే అవకాశం ఉంది. మరో విషయం ఏమిటంటే విష్ణువిశాల్, అమలాపాల్‌లది హిట్‌ ఫెయిర్‌. ఇంతకు ముందు ఈ జంట నటించిన రాక్షసన్‌ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆ చిత్రం నుంచి విజయ్‌సేతుపతి ఔట్‌

స్నేహితుడి కోసం...

కోలీ కాలింగ్‌!

వినోదాల ఎర్రచీర

మంచువారింట ఆనందం

రివెంజ్‌ లీడర్‌

నువ్వెళ్లే రహదారికి జోహారు

అందుకే చిన్న పాత్ర అయినా చేశా!

‘మహానటి’.. కీర్తి సురేష్‌

ఈ అవార్డు మా అమ్మకు అంకితం

కెప్టెన్సీలో విఫలం.. వరుణ్‌ సందేశ్‌కు శిక్ష

అవార్డు విన్నర్లకు సీఎం జగన్‌ అభినందనలు

మేము ఇద్దరం కలిస్తే అంతే!

‘ధాకడ్‌’ కోసం తుపాకీ పట్టిన కంగనా రనౌత్‌

మెగాస్టార్ చెప్పిన‌ట్టే జ‌రిగింది!

'ఈ అవార్డులు మా బాధ్యతను పెంచాయి'

‘కథనం’ మూవీ రివ్యూ

అనుష్క కోసం సాహో స్పెషల్‌ షో..?

‘మహానటి’కి జాతీయ అవార్డులు

అమ్మాయి పుట్టింది : మంచు విష్ణు

పక్కా బిజినెస్‌మేన్‌ ఆయన..

‘మన్మథుడు 2‌‌’ మూవీ రివ్యూ

బిగ్‌బాస్‌.. శ్రీముఖికి షాక్!

మేజర్‌ అజయ్‌ కృష్ణారెడ్డి రిపోర్టింగ్‌..

దాని నుంచి బయట పడడానికి ఆయుర్వేద చికిత్స..

జీవీకి ఉత్తమ నటుడు అవార్డు

నవ్వు.. భయం...

ఒప్పుకో.. లేదా చచ్చిపో

న్యూ ఇయర్‌ గిఫ్ట్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

జెర్సీ రీమేక్‌లో ఓకేనా?

ఆ చిత్రం నుంచి విజయ్‌సేతుపతి ఔట్‌

స్నేహితుడి కోసం...

కోలీ కాలింగ్‌!

వినోదాల ఎర్రచీర

మంచువారింట ఆనందం