బాలకృష్ణ బీబీ3లో అమలా పాల్‌!

6 Jul, 2020 12:42 IST|Sakshi

హైదరాబాద్‌: హీరో నందమూరి బాలకృష్ణ 60వ పుట్టినరోజు(జూన్ 9) సందర్భంగా మాస్‌ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న సినిమా బీబీ3 (బాలకృష్ణ–బోయపాటి) ఫస్ట్‌ రోర్‌ పేరుతో 64 సెకండ్ల వీడియోను విడుదల చేసిన విషయంలో తెలిసిందే. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం దక్షాణాది భామ అమలా పాల్‌ను చిత్ర నిర్మాతలు సంప్రదించినట్లు సమాచారం. అంతేగాక దర్శకుడు బోయపాటి ఇటీవల అమలాకు కాల్‌ చేసి సినిమా స్క్రిప్ట్‌ను వివరించగా దానికి ఆమె ఆసక్తి చూపినట్లు చిత్ర యూనిట్‌ పేర్కొంది. త్వరలో అమలా పాత్రను అధికారిక ప్రకటన కూడా చేయనున్నట్లు సమాచారం. (బాలయ్య అభిమానులకు మరో కానుక)

అయితే ఇదే పాత్ర కోసం దర్శక, నిర్మాతలు హీరోయిన్‌ శ్రియా శరణ్‌ను సంప్రదించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. వివిధ కారణాల వల్ల తాను అంగీకరించలేదని టాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో సెకండ్‌ హీరోయిన్‌ లీడ్‌ రోల్‌ పాత్రను కూడా త్వరలో చిత్ర యూనిట్‌ ప్రకటించనుంది. బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ను విలన్‌ పాత్లో నటింపజేయాలని నిర్మాతలు చర్చించుకుంటున్నట్లు కూడా సమాచారం. ఈ సినిమా 2021 వేసవిలో విడుదల కానున్నట్లు సమాచారం. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్‌ను మార్చి మొదటి వారంలో ప్రారంభించారు. కరోనా కారణంగా ఈ షూటింగ్‌ ఆగిపోయింది. ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన ‘సింహా’ (2010), ‘లెజెండ్‌’ (2014) సినిమాలు బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. (బాలయ్యా మజాకా? అందులోనూ రికార్డులే!)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా