అమలా ఔట్‌?

15 Nov, 2019 05:38 IST|Sakshi
అమలా పాల్‌

ప్రముఖ దర్శకులు మణిరత్నం భారీ తారాగణంతో, భారీ బడ్జెట్‌తో ‘పొన్నియిన్‌ సెల్వమ్‌’ చిత్రం తెరకెక్కించనున్నారు. ఐశ్వర్యారాయ్, విక్రమ్, కార్తీ, ‘జయం’ రవి, నయనతార, కీర్తీ సురేశ్, అమలా పాల్‌ ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. ఈ సినిమా నుంచి అమలా పాల్‌ తప్పుకున్నారనే వార్త బయటకు వచ్చింది. పీరియాడికల్‌ చిత్రం కావడంతో సినిమా షూటింగ్‌ ప్రారంభానికి అనుకున్న దానికన్నా ఎక్కువ సమయం పడుతోంది. షూటింVŠ  లేట్‌ కావడంతో యాక్ట్‌ర్స్‌ డేట్స్‌ సమస్య ఏర్పడుతోంది. ప్రస్తుతం అమలా పాల్‌కి కూడా ఇదే సమస్య అని తెలిసింది. డేట్స్‌ కారణంగానే అమల ఈ సినిమా నుంచి బయటకు వచ్చేశారట. ఇప్పుడు అమల స్థానంలో ఎవరు నటిస్తారో తెలియాలి. లైకా ప్రొడక్షన్స్‌ నిర్మించనున్న ఈ చిత్రం డిసెంబర్‌లో షూటింగ్‌ ప్రారంభం కానుంది.

మరిన్ని వార్తలు