ఆయన అడిగితే కాదంటానా!

6 Jan, 2016 08:39 IST|Sakshi
ఆయన అడిగితే కాదంటానా!

కమలహాసన్, రజనీకాంత్ వంటి స్టార్ హీరోలతో 1990 ప్రాంతంలో నటించి ప్రముఖ కథానాయకిగా వెలుగొందిన నటి అమల. తెలుగులోనూ చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్  ప్రముఖ కథానాయకులతో నటించిన అమల నాగార్జునను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపట్టారు. ఆ తరువాత పలువురు దర్శక నిర్మాతలు అమలను మళ్ల నటింపజేయాలని ప్రయత్నించినా ఆమె సుముఖత వ్యక్తం చేయలేదు. రెండు దశాబ్దాల తరువాత ఆ మధ్య లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ అనే చిత్రంలో మెరిశారు. అమల లాంటి ప్రతిభావంతురాలు రీఎంట్రీ అయితే ఇక మన దర్శక నిర్మాతలు చూస్తూ ఊరుకుంటారా? అంత వరకూ ఎందుకు విశ్వ నటుడు కమలహాసనే అమలను తన చిత్రంలో నటించమని కోరారు. అంతటి గొప్ప నటుడు అడిగితే అమల ఎలా కాదనగలరు. కథ, తన పాత్ర బాగుంటే. ఆమె త్వరలో కమలహసన్‌తో కలిసి అప్పా అమ్మా విళైయాట్టు చిత్రంలో నటించనున్నారు. దీనిగురించి అమల ఏమంటున్నారో చూద్దాం.

'మళ్లీ కమలహాసన్‌తో కలిసి నటిస్తానని ఊహించలేదు. ఒక కార్యక్రమంలో కలిసిన ఆయన తనతో నటిస్తారా అని అడిగారు. నేనూ ఓకే అన్నాను. అంతే దర్శకుడు రాజీవ్‌కుమార్ పంపి కథ వినిపించారు. కథ బాగుంది. పాత్ర తనకు తగినట్లు ఉంది. చిత్ర షూటింగ్ అమెరికాలో చిత్రీకరించనున్నారు. ఇందులో నేను కమల్‌కు భార్యగా నటించనున్నాను. షూటింగ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. బహూశా ఫిబ్రవరిలో ప్రారంభం కావచ్చు. అయితే నేను ఇప్పటికే చాలా బిజీగా ఉన్నాను. పనులు చాలా ఉన్నాయి. అందువల్ల కమలహాసన్‌కు జంటగా ప్రత్యేక పాత్రలోనే నటించనున్నాను. ఎక్కువ రోజులు కాల్‌షీట్స్ కేటాయించలేను. సినిమాలో నేను చాలా నేర్చుకున్నాను. అందుకే మళ్లీ నటించడానికి సిద్ధమయ్యాను. అయితే నాకు తగిన పాత్ర అయితేనే అంగీకరిస్తాను' అని అమల పేర్కొన్నారు. ఈ చిత్రంలోనే నటి శ్రుతిహాసన్ నటించనున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫ్లాప్ హీరో కోసం నలుగురు స్టార్స్

పోలీస్‌రాజ్యంలో ఓవియ

ప్రభాస్‌... యంగ్‌ రెబల్‌స్టార్‌ కాదు!

బాషా... ఫెంటాస్టిక్‌

వాళ్లంతా ఎన్టీఆర్‌ను అవమానించినట్లే: ఆర్జీవీ

రోడ్డు ప్రమాదంలో యువ హీరోకు గాయాలు

సీనియర్‌ నటి షకీలా కన్నుమూత

'జైలవకుశ' ఎర్లీ ట్విట్టర్‌ రివ్యూ!

హిందీ సిన్మా కంటే ముందు...

నాన్నగారి ఇంటి నుంచే వచ్చా!

రంగస్థలంపై చిరు!

బిగ్‌బాస్‌: దీక్ష సంచలన వ్యాఖ్యలు

అర్ధరాత్రి లైంగికంగా వేధించారు: నటి కాంచన

బిగ్‌బాస్‌ ప్రజల్ని ఫూల్‌ చేస్తోందా?

‘రేయ్‌ మన రిసార్టులో దెయ్యం ఉందిరా..’

యాక్షన్‌ థ్రిల్లర్‌గా కింగ్స్‌మెన్‌ ది గోల్డెన్‌సర్కిల్‌

విక్రమ్ పాటకు భారీగా ‘స్కెచ్‌’

అమెరికా, జపాన్‌లతో సుష్మ చర్చలు

స్క్రీన్‌ టెస్ట్‌

ఆమె అసలు బాలయ్య కూతురేనా?

భరత్ఃఅసెంబ్లీ

మహేష్ కోసం 2 కోట్లతో భారీ సెట్..!

మహేష్ మూవీ షూటింగ్కు బ్రేక్..!

మహేష్ కెరీర్లో తొలిసారి..!

రాజకీయాలు తక్కువ.. కుటుంబమే ఎక్కువ!

త్వరలో అసెంబ్లీకి మహేష్..!

సంక్రాంతికి చిన్నోడు

కథ కోసం కోటి రూపాయలు..?

మహేష్ మూవీ టైటిల్పై దేవీ శ్రీ క్లారిటీ

సూపర్ స్టార్ ప్రమాణ స్వీకారం..?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వన్‌ బకెట్‌ చాలెంజ్‌ను ప్రారంభించిన సమంత

బిగ్‌బాస్‌.. ద వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌

‘విజయ్‌తో చేయాలనుంది’

చలికి వణికి తెలుసుకున్నా బతికి ఉన్నాలే

ధమ్కీ ఇవ్వడం పూర్తయింది

నవ్వించే ఇట్టిమాణి