కథతో పాటే కామెడీ

16 Nov, 2018 01:54 IST|Sakshi
సత్య, ‘వెన్నెల’ కిశోర్, శ్రీను వైట్ల, శ్రీనివాస్‌ రెడ్డి, గిరిధర్‌

శ్రీను వైట్ల

రవితేజ, ఇలియానా జంటగా నటించిన చిత్రం ‘అమర్‌ అక్బర్‌ ఆంటొని’. శ్రీనువైట్ల దర్శకత్వంలో మైత్రీ మూవీస్‌పై నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, చెరుకూరి మోహన్‌ నిర్మించిన ఈ చిత్రం  ఈరోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఈ చిత్రంలోని హాస్యనటులతో పాటు చిత్రదర్శకుడు శ్రీను వైట్ల పాల్గొన్నారు. ‘వెన్నెల’ కిశోర్‌ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో నా పాత్ర పేరు చంటి మిరియాల.

దర్శకుడు శ్రీనుగారు తన ప్రతి సినిమాలోనూ మంచి క్యారెక్టర్‌ ఇచ్చి ప్రోత్సహిస్తారు. ఫస్ట్‌ టైమ్‌ నా కెరీర్‌లో నెగిటివ్‌ షేడ్‌ ఉన్న పాత్ర చేశాను. ఓ కమెడియన్‌ రోల్‌ని స్టార్టింగ్‌ టు ఎండింగ్‌ డిజైన్‌ చేసే డైరెక్టర్స్‌లో శ్రీనుగారు ఒకరు’’ అన్నారు. నటుడు శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో ‘వాటా’ (హోల్‌ ఆంధ్రా, తెలంగాణ ఆర్టిస్ట్‌ యూనియన్‌) లో మేమందరం చేసే అల్లరి మామూలుగా ఉండదు. ప్రతి సీన్‌ చాలా ఎంజాయ్‌ చేస్తూ చే శాం. రఘుబాబుగారిని విపరీతంగా టీజ్‌ చేసే క్యారెక్టర్‌ నాది. శ్రీను వైట్లగారు ప్రతి సినిమాలో మమ్మల్ని పెట్టుకుని ఆదరించినందుకు చాలా థ్యాంక్స్‌’’ అన్నారు.

నటుడు గిరిధర్‌ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలోని చేతన్‌ శర్మ పాత్ర ద్వారా నా కెరీర్‌ మరో లేయర్‌లోకి వెళ్లే పాత్ర ఇది. ‘వెన్నెల’ కిశోర్‌గారి అసిస్టెంట్‌ పాత్ర నాది. చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. అందరూ ఎంజాయ్‌ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల మాట్లాడుతూ– ‘‘ఈ కామెడీ గ్యాంగ్‌తో పాటు సెకండ్‌ హాఫ్‌లో సునీల్‌ జాయినవుతాడు. అతని పేరు బేబీ సిట్టర్‌ బాబి. ఆ పాత్ర ద్వారా ఆయన ప్రేక్షకులను విపరీతంగా నవ్విస్తారు. ఈ కామెడీ పాత్రలన్నీ కథలో కలిసి ఉంటాయి. సెపరేట్‌ ట్రాక్‌లు కాదు. మొదటినుంచి చివరివరకు ఈ పాత్రలన్నీ సినిమాలో ఉంటాయి. చాలా రోజుల తర్వాత ఇంత బాగా కామెడీ సెట్‌ అయినందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘ఇస్మార్ట్‌ ’ పోలీస్‌!

బేడీలు వేస్తాం!

మా ఊరిని చూపించాలనుంది

మళ్లీ నిన్నే పెళ్లాడతా

మంచు వారింట్లో సీమంతం సందడి

సైమా...షురూ...

అనుష్క ‘నిశ్శబ్దం’ పోస్టర్‌ రిలీజ్‌

‘ఆమె ఆరోపణలతో తలెత్తుకోలేక పోతున్నాం’

‘మా కొడుకు మమ్మల్ని కలిపి ఉంచుతున్నాడు’

రూల్స్‌ బ్రేక్‌ చేసిన వర్మ.. ఫైన్‌ వేసిన పోలీసులు!

ఉత్తర ట్రైలర్‌ లాంచ్‌

ఇస్మార్ట్ సంబరాల్లో వర్మ

అడవి శేష్‌ ‘ఎవరు’ రీమేకా?

ఆమె స్టెప్పేస్తే.. ‘కెవ్వు కేకే’

‘బిగ్‌బాస్‌’లా టాస్క్‌లు ఇచ్చిన నాగ్‌!

నాగార్జున డౌన్‌ డౌన్‌ నినాదాలు; ఉద్రిక్తత!

బైక్‌ మీద సినిమాకెళ్తున్నా : ఆర్జీవీ

బిగ్‌బాస్‌-3: ఎలిమినేషన్‌ ఓటింగ్‌ ఫార్మెట్‌ మారిందా!?

సెన్సార్‌ పూర్తి చేసుకున్న ‘డియర్‌ కామ్రేడ్‌’

బిగ్‌బాస్‌ 3 కంటెస్టెంట్స్‌ వీరే..!

నాలుగో సినిమా లైన్‌లో పెట్టిన బన్నీ

మరోసారి పోలీస్ పాత్రలో!

చిరంజీవి గారి సినిమాలో కూడా..

ఆమె పుట్టగానే.. నర్సు ఏమన్నదంటే!

నటికి బెయిల్‌.. ఊపిరి పీల్చుకున్న బిగ్‌బాస్‌

రీల్‌ ఎన్‌జీకే రియల్‌ అవుతాడా?

తెలుగు సినిమాకి మంచి కాలం

సోడాల్రాజు

నో కాంప్రమైజ్‌

సముద్రాల రచనలు పెద్ద బాలశిక్ష

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బేడీలు వేస్తాం!

మా ఊరిని చూపించాలనుంది

మళ్లీ నిన్నే పెళ్లాడతా

మంచు వారింట్లో సీమంతం సందడి

సైమా...షురూ...

అనుష్క ‘నిశ్శబ్దం’ పోస్టర్‌ రిలీజ్‌