ఈ రోజు మళ్లీ మళ్లీ రావాలి

10 Dec, 2017 00:13 IST|Sakshi
అంబరీష్,సుమలత, పార్టీలో స్టార్స్‌

‘మళ్లి మళ్లి ఇది రాని రోజు..’ అంటూ ‘రాక్షసుడు’ సినిమాలో చిరంజీవి, సుహాసిని పాడుకున్న పాట గుర్తుండే ఉంటుంది. కన్నడ ఇంటి కోడలైన తెలుగు అమ్మాయి సుమలత ఈ పాటను జస్ట్‌ మార్చి, ‘ఈ రోజు మళ్లీ మళ్లీ రావాలి’ అనుకున్నారు. దానికి కారణం లేకపోలేదు. కన్నడ నటుడు అంబరీష్, సుమలతల వైవాహిక జీవితం సిల్వర్‌ జూబ్లీ కూడా పూర్తి చేసుకుంది. అదేనండీ పెళ్లై 25 ఏళ్లయింది. ఈ నెల 7న ఈ దంపతుల పెళ్లి రోజు. బెంగళూరులో తమ వెడ్డింగ్‌ యానివర్శిరీని ఘనంగా జరుపుకున్నారు.

ఈ వేడుకలో జయసుధ, జయప్రద, రమ్యకృష్ణ, ఖుష్బూ, సీనియర్‌ నరేశ్‌ తదితరులు పాల్గొన్నారు. ‘‘బాధ, సంతోషం.. మంచి, చెడు.. ఇవన్నీ ఏ జంట జీవితంలో అయినా సహజం. ఇవన్నీ ఉంటేనే సంసారం బాగుంటుంది. వీటిని అధిగమించడానికి నాకు తోడుగా ఉన్నారు నా డియర్‌ హబ్బీ’’ అని ఈ సందర్భంగా సుమలత పేర్కొన్నారు. స్నేహితులందరూ పాల్గొనడంతో ఈ వేడుకకు నిండుదనం చేకూరిందని కూడా ఆమె అన్నారు. ఇలాంటి ఆనందకరమైన రోజులు మళ్లీ మళ్లీ రావాలని ఆమె అభిలషించారు.

మరిన్ని వార్తలు