ప్రముఖ హాలీవుడ్‌ నటుడి కన్నుమూత

16 Sep, 2017 09:05 IST|Sakshi

లాస్ ఏంజెల్స్: ప్రముఖ హాలీవుడ్‌నటుడు, టీవీ యాక్టర్‌  హ్యారీ డీన్ స్టాంటన్ (91)  కన్నుమూశారు.  అనారోగ్యంతో చికిత్స పొందుతూ లాస్‌ఏంజిల్స్‌లోని ఆసుపత్రిలో శుక్రవారం తుది శ్వాస విడిచారని   స్టాంటన్‌ ఏజెంట్ జాన్ ఎస్ కెల్లీ  ప్రకటించారు.

ప్రధానంగా సపోర్టింగ్‌  క్యారెక్టర‍్లతో కరియర్‌ను ప్రారంభించిన హ్యారీ తన నటనా ప్రతిభతో  పలువురి ప్రశంసలందుకున్నారు.  దాదాపు ఆరు దశాబ్దాలకు పైగా హాలీవుడ్‌కు సేవలందించారు. డేవిడ్ లించ్, సామ్ పెకిన్పా, రిడ్లీ స్కాట్, అలెక్స్ కాక్స్, విమ్ వెండర్స్ లాంటి ప్రఖ్యాత దర్శకులతో కలిసి పనిచేశారు.  హెచ్‌బీవో సిరీస్‌   ‘బిగ్‌లవ్‌’  లో  రోమ గ్రాంట్‌  ప్రవక్త గా ఆకట్టుకున్నారు.

ముఖ్యంగా గాడ్‌ఫాదర్‌-2 అతిధి పాత్ర, పారిస్‌, టెక్సాస్‌తోపాటు  'ఏలియన్,' 'ది గ్రీన్ మైల్,' 'ప్రెట్టీ ఇన్ పింక్', 'దిఎవెంజర్స్',  సినిమాల్లోని పాత్రలు ఆయనకు బాగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. పలువురు హాలీవుడ్‌ దర్శకులు, నటులు ఇతర ప్రముఖులు హ్యారీ మరణంపై సంతాపం వ్యక్తం చేశారు.