డిసెంబర్‌ 4న ‘బ్రహ్మస్త్ర’

2 Feb, 2020 20:55 IST|Sakshi

రణ్‌బీర్‌ కపూర్, ఆలియా భట్‌ జంటగా అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. అమితాబ్‌ బచ్చన్, నాగార్జున, డింపుల్‌ కపాడియా, మౌనీరాయ్‌ కీలక పాత్రధారులు. ఈ చిత్రాన్ని కరణ్‌ జోహార్‌ నిర్మిస్తున్నారు. ఒక శక్తిమంతమైన ఆయుధం చుట్టూ ఈ సినిమా కథాంశం తిరుగుతుంది. చేతుల నుంచి నిప్పును రప్పించే శివ పాత్రలో రణ్‌బీర్, ఇషా పాత్రలో ఆలియా కనిపిస్తారన్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం విడుదలకు సంబందించి ఒక ఫోటోను బిగ్‌బీ తన ట్వీటర్‌ ఖాతాలో  పోస్ట్‌ చేశారు. ‘బ్రహ్మస్త్ర సినిమా హింది, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి.. డిసెంబర్‌ 4, 2020 ప్రేక్షకుల ముందుకు రానుంది’  అని బిగ్‌బీ వెల్లడించారు.

‘బ్రహ్మస్త్ర’ ఓ పాన్‌ ఇండియా సినిమాగా తెరకెక్కుతోంది. అదేవిధంగా ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న ఆలియా భట్‌  తన ఇస్టాగ్రామ్‌ ఖాతాలో చిత్ర విడుదలకు సంబంధించి ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. ‘బ్రహ్మస్త్ర మూవీ డిసెంబర్‌ 4న విడుదల అవుతుంది’ అని ఆమె తెలిపారు. పాన్ ఇండియా చిత్రంగా తెరుకెక్కుతున్న ఈ సినిమా చూడాలంటే డిసెంబర్‌ నాలుగు వరకు ఆగాల్సిందే.  చదవండి: పరిశోధకుడు

@amitabhbachchan #RanbirKapoor #AkkineniNagarjuna @imouniroy @ayan_mukerji @ipritamofficial @karanjohar @apoorva1972 #NamitMalhotra @marijkedesouza @dharmamovies @foxstarhindi @brahmastrafilm

A post shared by Alia ☀️ (@aliaabhatt) on

మరిన్ని వార్తలు