‘బిగ్‌బీ సినిమా విడుదల కాకుండా అడ్డుకుంటా’

17 Nov, 2019 17:11 IST|Sakshi

బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఝండ్‌’. వచ్చే నెలలో విడుదల కానున్న ఈ సినిమాను వివాదాలు చుట్టుముట్టాయి. ఈ సినిమా కాపీరైట్స్‌ నావంటూ తెలుగు పరిశ్రమకు చెందిన చిన్నికుమార్‌ మీడియా ముందుకు వచ్చాడు. తాను గతంలో రిజిస్టర్‌ చేసుకున్న సినిమాను కాపీ కొట్టారంటూ ఝండ్‌ టీంపై ఆరోపణలు గుప్పించారు. ఈ మేరకు బిగ్‌బీకి, దర్శకుడు, నిర్మాత నాగరాజు ముంజులకు నోటీసులు పంపించాడు. అయితే దీనిపై వారు ఏమాత్రం స్పందించట్లేదని ఆయన వాపోయాడు. వీరితోపాటు నిర్మాత క్రిష్ణన్‌ కుమార్‌, టీ-సిరీస్‌ చైర్మన్‌ భూషణ్‌ కుమార్‌, స్లమ్‌ సాకర్‌ వ్యవస్థాపకుడు విజయ్‌ బార్సేలకు నోటిసులు అందించాడు.

ఈ విషయంపై చిన్నికుమార్‌ మాట్లాడుతూ.. ఝండ్‌ చిత్రబృందానికి నోటీసులు అందాయని, కానీ టీసిరీస్‌ మాత్రమే దీనిపై స్పందించిందన్నారు. వారి సమాధానం అస్పష్టంగా ఉందని చెప్పుకొచ్చాడు. అవసరమైతే ఈ సినిమాను నిలిపివేయడానికి కోర్టుకు వెళ్లడానికి సిద్ధమన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో ఝండ్‌ సినిమాను అడ్డుకుని తీరుతానని చిన్నికుమార్‌ స్పష్టం చేశాడు. 

వివాదమేంటంటే..
ఝండ్‌ చిత్రం ప్రధానంగా స్లమ్‌ సాకర్‌ను స్థాపించిన విజయ్‌ బార్సే జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది.విజయ్‌ బార్సే.. స్లమ్‌ సాకర్‌ వరల్డ్‌కప్‌కు భారత కెప్టెన్‌గా వ్యవహరించిన అఖిలేశ్‌ పౌల్‌కు కోచ్‌గా వ్యవహరించాడు. ఇతని పాత్ర సినిమాలో ఎంతో కీలకమైనది. మరోవైపు తెలుగు నిర్మాత చిన్నికుమార్‌ ఈపాటికే అఖిలేశ్‌ పౌల్‌ బయోగ్రఫీని తెరకెక్కించడానికి హక్కులు కొన్నాడని పేర్కొంటున్నాడు. 2018లోనే దీనికి సంబంధించిన కథను రిజిస్టర్‌ చేయించుకున్నాని తెలిపాడు. ఇప్పుడు దీనిపై నోరు విప్పినందుకు నాగరాజు సెటిల్‌మెంట్‌ చేసుకుందామంటూ బలవంతపెడుతున్నాడని చెప్పుకొచ్చాడు. తనపై బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించాడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘రూ వంద కోట్ల క్లబ్‌ చేరువలో బాలా’

ఇది నిజం ఫొటో కాదు

ఈ కలయిక ఏ క్రేజ్‌కు చిహ్నం?

మిస్‌ యూ రాహుల్‌ : పునర్నవి

రజనీ అభిమానులకు మరో పండుగ

మేకప్‌ అంటే అస్సలు నచ్చదు: రష్మిక

ఆయనతో లిప్‌లాక్‌ అంటే ఓకే!

ముద్దు మురిపాలు

నిర్మాతే నా హీరో

కొత్త కాంబినేషన్‌ గురూ

నాటకమే జీవితం

ఒక్క హౌస్‌ఫుల్‌ చాలు అనుకున్నా

ఎల్సా పాత్రతో నాకు పోలికలున్నాయి

డిసెంబరులో సందడి?

మా జాగ్రత్తలు ఫలించలేదు

అభిషేక్‌ లేఖను పంచుకున్న బిగ్‌బీ!

సింగిలే అంటున్న కార్తికేయ..

‘ఇండియా నైటింగేల్‌ను కోల్పోయామా?’

ఒక్కొక్క కేసుకి.. ఒక్కో పేరు!

మా మధ్య మంచి కెమిస్ట్రీ ఉంది: హీరోయిన్‌

టీజర్ లోడ్ అవుతోందట

ఆ మూవీపై లోక్‌సభ స్పీకర్‌ అభ్యంతరం!

‘జోకర్‌’కు చైనా ఫ్యాన్స్‌ ఫిదా.. సరికొత్త రికార్డులు

దీపికా, అలియాలతో విజయ్‌ దేవరకొండ సందడి

మానుషి చిల్లర్ బాలీవుడ్‌ ఎంట్రీ

గాయపడ్డ హీరోయిన్‌.. మెడకు బ్యాండేజ్‌

రాజ్‌కుమార్‌కు ఆర్థిక సాయం

అలాంటి సినిమాలు ఇక చేయను

సక్కనమ్మ చిక్కింది!

ఒక్కటయ్యారు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘బిగ్‌బీ సినిమా విడుదల కాకుండా అడ్డుకుంటా’

ఇది నిజం ఫొటో కాదు

ఈ కలయిక ఏ క్రేజ్‌కు చిహ్నం?

మిస్‌ యూ రాహుల్‌ : పునర్నవి

రజనీ అభిమానులకు మరో పండుగ

మేకప్‌ అంటే అస్సలు నచ్చదు: రష్మిక