ఫిఫ్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ..

7 Nov, 2019 10:20 IST|Sakshi

ముంబై : లెజెండరీ నటుడు, బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ దశాబ్దాల తరబడి సినీ ప్రియులను అలరిస్తూ హిందీ సినీ పరిశ్రమలో 50 ఏళ్ల ప్రస్ధానాన్ని పూర్తిచేసుకున్నారు. 1969లో సాథ్‌ హిందుస్తానీ చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన అమితాబ్‌ తన నటనతో దేశవ్యాప్తంగా సినీ అభిమానులను ఉర్రూతలూగించారు. భారత్‌లోనే కాకుండా విదేశాల్లోనూ అమితాబ్‌ నటనకు సినీ ప్రియులు నీరాజనాలు పలికారు. సుదీర్ఘ సినీ పయనంలో పలు బ్లాక్‌బస్టర్లు అందించిన అమితాబ్ తన నట ప్రస్ధానం కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ సినిమాల్లో అమితాబ్‌ ఎంట్రీ సీన్‌కు ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వస్తోందంటే అతిశయోక్తి కాదు.

బిగ్‌బీ తొలి మూవీ సాథ్‌ హిందుస్తానీ 1969 నవంబర్‌ 7న విడుదలై 50 సంవత్సరాలు పూర్తిచేసుకుంది. ఐదు దశాబ్ధాలుగా సినీ ప్రియులను అలరిస్తున్న అమితాబ్‌ తన నటవారసునిగా అభిషేక​ బచ్చన్‌ను పరిశ్రమకు అందించారు. అమితాబ్‌ 50 ఏళ్ల సినీ ప్రస్ధానం సందర్భంగా ఆయన కుమారుడు అభిషేక్‌ తన తండ్రి హీరోగా ఎదిగిన తొలినాళ్ల ఫోటోను పోస్ట్‌ చేశారు. కేవలం కుమారుడిగానే కాదు..నటుడిగా..ఓ అభిమానిగా మేమంతా మీ ఔన్నత్యానికి సాక్షులుగా నిలిచామని అభిషేక్‌ రాసుకొచ్చారు. సినీ అభిమానులంతా తాము బచ్చన్‌ తరంలో జీవించామని గర్వంగా చెప్పుకుంటారని, 50 ఏళ్లు సినీ జీవితంలో కొనసాగినందుకు అభినందనలు తెలిపారు. మరో 50 ఏళ్ల కోసం తాము నిరీక్షిస్తామని అభిషేక్‌ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అతనే నా మొదటి ప్రియుడు: నటి

వేడుక చేద్దాం.. లవ్‌ యూ పప్పా: శృతిహాసన్‌

ప్రేమలో పడ్డాను.. పేరు చెప్పలేను: రాహుల్‌

ఆ కాంబినేషన్‌ ఇప్పుడు సెట్‌ కానుందా?

ప్రేమ కాదు ఫ్రెండ్‌షిప్పే!

నా గొంతు వినండి

అంతా నిశ్శబ్దం

ప్రేమతోనే సమస్య

నాలుగేళ్లకు మళ్లీ!

మామా అల్లుడి పాటల సందడి

చెల్లెలి కోసం...

మళ్లీ మళ్లీ రాని అవకాశం

సమయానికి వస్తాను... చెప్పింది చేస్తాను

కనెక్ట్‌ అయిపోతారు

‘జార్జ్‌రెడ్డి’ లిరికల్‌ వీడియో సాంగ్‌ ప్రోమో

తల్లిదండ్రుల విడాకులపై స్పందించిన శ్రుతి హాసన్‌

అందరూ..అనుమానితులే..

త్వరలో పున్నుతో లైవ్‌లోకి వస్తా: రాహుల్‌

చిన్న తాలా! దిష్టి తగులుతుంది కదా!

అది టెలికాస్ట్‌ చేయలేదు: బాబా భాస్కర్‌

టైటిల్‌ చేజారినా శ్రీముఖికి భారీ పేచెక్‌..

‘నిన్ను కన్నందుకు నీ తల్లి బాధపడాలి’

అభిమానిని తోసిపారేసిన రణు మొండాల్‌

‘నిరుద్యోగి’ కామెంట్‌పై ఆ హీరో అద్భుత రిప్లై..

ఆంటీ అన్నందుకు బూతులు తిట్టిన నటి

అలా చేయొద్దని తాత చెప్పారు: హీరో

బిగ్‌బాస్‌ ఫలితంపై యాంకర్‌ ఝాన్సీ అసహనం

మురుగదాస్‌పై నయనతార ఫైర్‌

విజయ్‌సేతుపతి ఇంటి ముట్టడి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అతనే నా మొదటి ప్రియుడు: నటి

వేడుక చేద్దాం.. లవ్‌ యూ పప్పా: శృతిహాసన్‌

ఫిఫ్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ..

ప్రేమలో పడ్డాను.. పేరు చెప్పలేను: రాహుల్‌

ఆ కాంబినేషన్‌ ఇప్పుడు సెట్‌ కానుందా?

ప్రేమ కాదు ఫ్రెండ్‌షిప్పే!