వారం తర్వాత ఇంటికి..

15 Jul, 2020 03:05 IST|Sakshi

బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్, ఆయన తనయుడు అభిషేక్‌ కరోనా పాజిటివ్‌తో ముంబై నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అలాగే ఆయన కోడలు ఐశ్వర్యా రాయ్, మనవరాలు ఆరాధ్యలకు కూడా పాజిటివ్‌ వచ్చినా, ఇద్దరూ ఇంటి వద్దే ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు. అమితాబ్, అభిషేక్‌ చికిత్సకు చక్కగా సహకరిస్తున్నారని, ఇద్దరు కోలుకుంటున్నారని, మరో వారం రోజులు ఆస్పత్రిలోనే ఉండాలని డాక్టర్లు పేర్కొన్నారట. కాగా బిగ్‌ బి కుటుంబం త్వరగా కోలుకోవాలని పలువురు సినిమా తారలు, అభిమానులు పూజలు చేస్తున్నారు. ‘‘మీ ప్రేమాభిమానాల వరదలో తడిసి ముద్దవుతున్నాను. మీ ప్రేమకు ఎలా స్పందించాలో అర్థం కావడంలేదు. ప్రస్తుతానికి నేను చీకటిలో ఉన్నాను. మీ అందరి అభిమానానికి తలవంచి నమస్కరిస్తున్నాను’’ అని ఆస్పత్రిలో చేరాక అమితాబ్‌ సోషల్‌ మీడియా ద్వారా పేర్కొన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు