‘అరవింద సమేత’లో బాలీవుడ్ టాప్‌ స్టార్‌..!

11 Sep, 2018 10:37 IST|Sakshi

వరుస విజయాలతో సూపర్‌ ఫాంలో ఉన్న యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తుతం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో అరవింద సమేత వీర రాఘవ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మేజర్‌ పార్ట్‌ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్‌ న్యూస్‌ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌ బచ్చన్‌ అతిథి పాత్రలో కనిపించనున్నారట.

బాలీవుడ్ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్ ఇటీవల సౌత్‌ సినిమాల మీద దృష్టి పెట్టారు. గతంలో మనం సినిమాలో చిన్న పాత్రలో మెరిసిన బిగ్‌బీ ప్రస్తుతం చిరంజీవి సైరా నరసింహారెడ్డిలో కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా అరవింద సమేతలోనూ అతిథి పాత్రలో కనిపిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై చిత్రయూనిట్ నుంచి ఎలాంటి సమాచారం లేదు. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బ్యాక్‌ టు వర్క్‌

పవర్‌ఫుల్‌ జర్నలిస్ట్‌

శరణం అయ్యప్ప

అక్షరాలా ఐదోసారి

Rool Movie Press Meet

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బ్యాక్‌ టు వర్క్‌

పవర్‌ఫుల్‌ జర్నలిస్ట్‌

శరణం అయ్యప్ప

అక్షరాలా ఐదోసారి

Rool Movie Press Meet

ఎ పోయి ఎ వచ్చె!