‘హైట్‌ గురించి మాట్లాడితే ఇంటికి వెళ్లలేను’

14 Nov, 2019 16:13 IST|Sakshi

బాలీవుడ్‌ బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి(కేబీసీ) రీయాలిటీ షో’కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కార్యక్రమం 11వ సీజన్‌ నడుస్తోంది. రియాలిటీ షో బుధవారం 11వ ఎపిసోడ్‌ జరిగింది. ఇందులో భాగంగా బిగ్‌ బీ కంటెస్టెంట్‌ చందన్‌తో మాట్లాడుతూ.. అతడి వ్యక్తిగత విషయాలను అడిగి తెలుసుకున్నారు. అతడు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని తెలుసుకున్న అమితాబ్‌.. తనకు తగిన వధువు వెదుక్కున్నాడని చెప్పారు. ఈ క్రమంలో తన భార్య జయా బచ్చన్‌ ఎత్తు గురించి ప్రస్తావించారు. ‘చందన్‌ తన ఎత్తుకు తగ్గ వధువును ఎంచుకున్నాడు. అయితే ఎత్తు విషయంలో నేను ఎలాంటి సలహా ఇవ్వలేను. అలా చేసి ఇంటికి వెళ్లే ధైర్యం చేయలేను’ అంటూ తామిద్దరి హైట్లలో ఉన్న వ్యత్యాసం గురించి చమత్కరించారు. దీంతో బిగ్‌ బీ మాటలకు అక్కడి వారంత తెగ నవ్వుకున్నారు. 

కాగా నేటి(గురువారం) ‘కర్మవీర్‌ స్పేషల్‌’  ఎపిసోడ్‌ సందర్భంగా కళింగ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్స్‌ (కీస్‌) ప్రొఫెసర్‌, ఒడిశా ఎంపీ అయిన అచ్యుత సమంతా బిగ్‌ బీ తో కలిసి హాట్‌ సీట్‌ను పంచుకోనున్నారు. అలాగే ఆయనతో పాటు స్టార్‌ హీరోయిన్‌ తాప్సీ పన్ను కూడా పాల్గొననున్నారు. కాగా ఈ ఎపిసోడ్‌ నవంబర్‌ 15వ తేదీ(శుక్రవారం) ప్రసారం కానుంది. ఈ సందర్భంగా ఎంపీ సమంతా ఫిలాసఫర్‌గా ఉన్న ప్రారంభంలో తను ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారో, విద్యావేత్తగా ఎలా ఎదిగారో ఈ ఎపిసోడ్‌లో చూడవచ్చు. అలాగే కీస్‌ విద్యార్థులు అమితాబ్‌ కోసం ప్రత్యేకంగా వేయించిన ప్రముఖ ఒడిశా డీజర్ట్‌ ‘చెన్నా పొడా’  పేయింటింగ్‌ అమితాబ్‌కు బహుకరిస్తారు. కాగా సమంతా ఒడిశా కందమహాల్‌ నుంచి బీజేపీ తరపున లోక్‌సభకు ఎన్నికైన విషయం తెలిసిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు