‘వరల్డ్‌కప్‌ వేదికను భారత్‌కు మార్చాలి’

14 Jun, 2019 20:21 IST|Sakshi

క్రికెట్‌ ప్రేమికులు అత్యంత ఆసక్తిగా తిలకిస్తున్న ఐసీసీ వరల్డ్‌కప్‌లోని వివిధ మ్యాచ్‌లకు వరణుడు అంతరాయం కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌లో జరుగుతున్న ఈ మెగా టోర్నీలో ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు వర్షార్పణమయ్యాయి. దీంతో ఐసీసీ తీరుపై క్రికెట్‌ అభిమానులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక క్రికెట్‌ను అమితంగా ఆరాధించే టీమిండియా ఫ్యాన్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గురువారం న్యూజిలాండ్‌తో జరగాల్సిన మ్యాచ్‌ రద్దవ్వడంతో వారి ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి.

ఈ క్రమంలో... ‘ఏ కాలంలో మ్యాచ్‌లు నిర్వహించాలో తెలియని ఐసీసీకి.. ధోని గ్లోవ్స్‌పై రాద్దాంతం చేయడం మాత్రం తెలుసు. సిగ్గుపడాలి’  అంటూ #ShameOnICC హ్యాష్‌ట్యాగ్‌తో ఐసీసీ తీరుపై మండిపడుతున్నారు. తాజాగా బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ కూడా ఈ విషయంపై స్పందించారు. ‘ వరల్డ్‌కప్‌ వేదికను భారత్‌కు మార్చండి. మాకు వర్షాల అవసరం ఎంతగానో ఉంది’ అంటూ చమత్కరించారు. నీటి ఎద్దడితో ఇబ్బందులు పడుతున్న భారత ప్రజలకు.. వరల్డ్‌కప్‌- వర్షం సెంటిమెంట్‌ కారణంగా కాస్తైనా ఉపశమనం లభిస్తుందనే ఉద్దేశంతో తనదైన శైలిలో ట్వీట్‌ చేశారు. కాగా వరణుడి కారణంగా కివీస్‌తో మ్యాచ్‌ రద్దవ్వడం పట్ల టీమిండియా ఆటగాడు కేదార్‌ జాదవ్‌ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. నాటింగ్‌హామ్‌లో కాకుండా.. కరువుతో అల్లాడుతున్న మహారాష్ట్రలో వర్షం పడాలని అతడు ఆకాంక్షించాడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ధోని రిటైర్మెంట్‌.. గంభీర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ఐసీసీకి కివీస్‌ కోచ్‌ విన్నపం

సూపర్‌ ఓవర్‌ టెన్షన్‌.. ప్రాణాలు వదిలిన కోచ్‌

ప్రపంచకప్‌ ఎఫెక్ట్‌: రాయ్‌ తొలిసారి

‘ఇక ఆడింది చాలు.. వెళ్లిపోండి’

స్టోక్స్‌ వద్దన్నా.. అంపైర్లు వింటేగా

‘బౌండరీ’కి బదులు రెండో సూపర్‌

విలియమ్సన్‌పై రవిశాస్త్రి ప్రశంసలు

ఆ ‘స్పెషల్‌’ జాబితాలో రోహిత్‌శర్మ

ఓ 50 ఏళ్లు దాటాక వీళ్లు ఎలా ఉంటారంటే..!

ప్రధానితో ప్రపంచకప్‌ విజేత

ఫైనల్లో పరాజితులు లేరు 

‘అప్పుడు సిక్స్‌తోనే సమాధానం ఉండేది’

వారి నిర్ణయమే ఫైనల్‌: ఐసీసీ

సచిన్‌ వరల్డ్‌కప్‌ జట్టు ఇదే..

ఐసీసీ రూల్‌పై ‘బిగ్‌’ పంచ్‌!

ఓవర్‌త్రోను చూసి ఎగిరి గంతులేశాడు!

ఆ సలహానే పని చేసింది: ఆర్చర్‌

ధోని సంగతి తెలీదు కానీ...

అంతా పీడకలలా అనిపిస్తోంది

వీధి రౌడీలా కాదు హీరోలా...

అదృష్టం మా వైపు ఉంది!

ప్రపంచకప్‌ ఫైనల్‌పై స్పందించిన కోహ్లి

వన్డేలకు రోహిత్‌.. టెస్ట్‌లకు కోహ్లి!

ఐసీసీ టీమ్‌ ఆఫ్‌ ది టోర్నీ.. కోహ్లికి దక్కని చోటు

క్రికెట్‌ రూల్స్‌పై దృష్టి సారించాల్సిందే: రోహిత్‌

‘ధోని రనౌట్‌ పాపమే చుట్టుకుంది’

ట్రోఫీ చేజార్చుకోవడం సిగ్గుచేటు : స్టోక్స్‌ తండ్రి

ఆర్చర్‌కు సూపర్‌ పవర్‌ ఉందా?

ఎట్లిస్తరయ్యా 6 పరుగులు?