వారితో కలిసి నటించడం ఆనందంగా ఉంది: బిగ్‌బీ

24 Jan, 2020 14:48 IST|Sakshi

బాలీవుడ్‌ బ్యూటీ కత్రినా కైఫ్‌కు తల్లిదండ్రుగా మారి ఆమె వివాహాం జరిపించారు బాలీవుడ్‌ బిగ్‌బీ దంపతులు అమితాబ్‌ బచ్చన్‌,  జయబచ్చన్‌లు. ఈ వివాహా మహోత్సవానికి తెలుగు, తమిళ, కన్నడ అగ్రకథానాయకులు నాగార్జున, ప్రభు, శివరాజ్‌లు హజరై సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అదేంటి కత్రినా పెళ్లి జరిగిందా! ఎవరితో.. అది కూడా బిగ్‌బీ దంపతులు తల్లిదండ్రులుగా ఆమెకు వివాహాం జరిపించడమేంటి అని షాక్‌ అవుతున్నారా. అయితే ఇదంతా జరిగింది రీల్‌లో రీయల్‌గా కాదు. అసలు విషయం ఎంటంటే కత్రినా ప్రముఖ కళ్యాణ్‌ జ్యూవెల్లర్స్‌ నగల దుకాణానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు.

కాగా ఈ నగల దుకాణం ప్రమోషన్‌లో భాగంగా ఓ యాడ్‌ను చిత్రికరిస్తున్నారు. ఇందులో కత్రినా పెళ్లి కూతిరిగా కనిపించగా ఆమెకు తల్లిదండ్రులుగా బిగ్‌బీ, ఆయన సతిమణి జయ బచ్చన్‌లు కనిపించనున్నారు. ఈ పెళ్లిలో నాగార్జున, ప్రభు గణేషన్‌, శివ రాజ్‌కూమార్‌లు ముఖ్య అతిథులుగా హాజరై పెళ్లి జరిపించారు. కాగా కళ్యాణ్‌ జ్యూవెల్లర్స్‌కు తెలుగులో అంబాసిడర్‌గా నాగార్జున వ్యవహిరించగా తమిళంలో ప్రభు గణేషన్‌, కన్నడలో శివరాజ్‌ కుమార్‌లు అంబాసిడర్‌లుగా వ్యవహిరస్తున్నారు. వీరితో పాటు అమితాబ్‌ బచ్చన్‌, జయ బచ్చన్‌ అంబాసిడర్‌లుగా ఉన్నారు. 

కాగా ఈ యాడ్‌కు సంబంధించిన షూటింగ్‌ ఫొటోలను బిగ్‌ బీ తన ట్విటర్‌ షేర్‌ చేస్తూ.. ‘జయకు నాకు ఇది ఎంతో గౌరవకారణమైనది. దీన్ని మేము ఎప్పటికీ మర్చిపోలేం. సీనీ పరిశ్రమలోని ముగ్గురూ లెజెండరి సూపరస్టార్‌ కుమారులతో కలిసి నటించడం ఎంతో సంతోషాన్నిచ్చింది. తెలుగు అగ్రకథానాయకుడు అక్కినేని నాగేశ్వరరావు తనయుడు నాగార్జున, తమిళ సూపర్‌ స్టార్‌ శివాజీ గణేషన్ తనయుడు ప్రభు గణేషన్‌‌, కన్నడ స్టార్‌ రాజ్‌కుమార్‌ తనయుడు శివరాజ్‌ కుమార్‌లతో కలిసి నటించాము’  అంటూ షేర్‌ చేశారు. తమ అభిమాన సూపర్‌ స్టార్‌లను ఒకే వేధికపై చూసిన ఫ్యాన్స్‌ హంగామా అంతా ఇంతా ఉండదు.  అలాంటిది ఒకే తెరపై కలిసి నటిస్తూ అది కూడా వివాహా వేడుకల్లో చూస్తే ఇంకా అభిమానులకు ఎంతటి కనుల పండగగా ఉంటుందో మీరే ఊహించుకోండి. 

మరిన్ని వార్తలు